అరకొర అవకాశాలు దక్కే టీమిండియా క్రికెటర్ సంజు శాంసన్‌కు మరోసారి దురరదృష్టం దారుణంగా వెంటాడింది. రాకరాక వచ్చిన అవకాశంలో విఫలమైన శాంసన్‌కు గాయం రూపంలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. అసలే అవకాశాలు రావడం కష్టమైన టైమ్‌లో.. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు సంజుకు ఛాన్స్ వచ్చింది. జట్టులో ప్లేస్ కూడా సెట్ అయింది. కానీ.. బ్యాటింగ్‌లో కేవలం 5 పరుగులు చేసిన శాంసన్ నిరాశపరిచాడు. అయినా కూడా టీమిండియా విజయం సాధించడంతో.. తర్వాత మ్యాచ్‌లో సత్తా చాటుతాడులే అనుకున్నారంతా.. కానీ.. ఫీల్డింగ్ సమయంలో మోకాలికి గాయం కావడంతో.. మిగిలిన రెండు మ్యాచ్‌లకు పూర్తిగా దూరం అయ్యాడు సంజు. దీంతో.. రాకరాక వచ్చిన అవకాశం ఇలా చేజారిపోయింది.
ఇక సంజు శాంసన్ గాయంతో సిరీస్‌కు దూరం కావడంతో అతని స్థానంలో రీప్లేస్‌మెంట్‌గా జితేష్ శర్మ అనే యువ క్రికెటర్‌ను జట్టులోకి తీసుకుంది బీసీసీఐ. అయితే.. సంజు శాంసన్‌ను రీప్లేస్ చేస్తున్న ఈ కుర్రాడు ఎవరంటూ.. క్రికెటర్ అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. ఈ జితేష్ శర్మ ఎవరో కాదు.. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న వికెట్ కమ్ బ్యాటర్. ముంబైకి చెందిన 29 ఏళ్ల జితేష్.. దేశవాళీ టోర్నీల్లో విదర్భకు ప్రతినిధ్యం వహిస్తాడు. ఇక ఐపీఎల్‌లో తొలుత ముంబై ఇండియన్స్ జితేష్‌ను కొనుగోలు చేసినా.. ఒక్క మ్యాచ్‌కు ఆడే అవకాశం ఇవ్వలేదు. గతేడాది ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్ జితేష్ శర్మను కొనుగోలు చేయడమే కాకుండా.. ఏకంగా మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం ఇచ్చింది.
ఈ 12 మ్యాచ్‌ల్లో 10 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు దిగిన జితేష్.. 234 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అందులో 44 పరుగులు అతని హైఎస్ట్ స్కోర్. 34 బంతుల్లో 44 పరుగుల ఇన్నింగ్స్‌ను జితేష్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడి ఆకట్టుకున్నాడు. అయితే.. జితేష్ 163 స్ట్రైక్‌రేట్ బ్యాటింగ్ చేయగలడు. ఐపీఎల్ 2022లో రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కు జితేష్‌ను తీసుకున్న పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్ 2023కు అదే ధరకు అతన్ని కొనసాగించింది. ఐపీఎల్‌లో పరిస్థితి ఇలా ఉంటే.. దేశవాళీ క్రికెటర్‌లో 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన జితేష్ 553 పరుగులు చేశాడు. అలాగే లిస్ట్-ఏలో 47 మ్యాచ్‌లాడి 1350 పరుగులు సాధించాడు. అందులో 2 సెంచరీలు ఉన్నాయి. మరి సంజు శాంసన్ స్థానంలో జితేష్ శర్మను రీప్లేస్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
NEWS – Sanju Samson ruled out of the remainder of T20I series.
The All-India Senior Selection Committee has named Jitesh Sharma as replacement for Sanju Samson.
More details here – https://t.co/0PMIjvONn6 #INDvSL @mastercardindia
— BCCI (@BCCI) January 4, 2023