గత కొంతకాలంగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య మటల యుద్ధం జరుగుతూనే ఉంది. 2023 ఆసియా కప్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో.. టీమిండియా పాక్ లోకి అడుగు పెట్టదని బీసీసీఐ చెప్పుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించింది. ఈ మీటింగ్ లో ఆసియా కప్ 2023 ను పాకిస్థాన్ లో నిర్వహించాలా? లేక యూఏఈ లాంటి దేశాలకు తరలించాలా? అన్న విషయంపై చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి షెడ్యూల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మార్చిలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ విషయంపై తన అక్కసును వెళ్లగక్కాడు పాక్ దిగ్గజ ఆటగాడు. ఇండియా పాకిస్థాన్ కు రాకపోతే.. నరకానికి పోతుందని పనికిమాలిన వ్యాఖ్యలు చేశాడు.
2023 ఆసియా కప్.. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇక ఈ ఆసియా కప్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే పాక్ ఆసియా కప్ కు ఆతిథ్యం ఇస్తే.. టీమిండియా ఆటగాళ్ల భద్రత దృష్ట్యా.. భారత్ ఈ ఆసియా కప్ లో పాల్గొనదని బీసీసీఐ చెప్పుకొస్తోంది. 2023 ఆసియా కప్ వేదిక మారుస్తేనే ఈ టోర్నీలో పాల్గొంటామని బీసీసీఐ తెగేసి చెప్పింది. అదీకాక తాజాగా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిర్మాణాత్మకమైన విషయాలు, మాట్లాడాల్సిన అంశాలు ఉన్నందున.. సమావేశాన్ని మళ్లీ నిర్వహించాలని ACC తెలిపింది.
ఇక ఈ నిర్ణయంపై స్పందించాడు పాక్ మాజీ ప్లేయర్ మియాందాద్. ప్రముఖ వార్త పత్రిక అయిన ఇండియా టుడే తో మియాందాద్ మాట్లాడుతూ..”నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. ఇండియా, పాక్ గడ్డపై అడుగుపెట్టకపోతే.. నరకానికి పోతుంది. అయితే అది మాకు అవసరం లేదు. టీమిండియా ఆసియా కప్ 2023 కు వచ్చేలా చూసుకోవాల్సిన పని ICCది. ఈ విషయాన్ని ఐసీసీ చూసుకోకపోతే.. గవర్నరింగ్ బాడీ ఉండి ఎందుకు? బీసీసీఐ పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోవాలి” అని మియాందాద్ అన్నాడు. అదీకాక ప్రపంచ క్రికెట్ లో ప్రతీ జట్టుకు ఒకే నిబంధనలు ఉండాలన్నాడు మియాందాద్.
ఇక టీమిండియా పాక్ లో పర్యటించి ఓడిపోతే.. భారత అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేరని పనికిమాలిన వ్యాఖ్యలు చేశాడు. భారత ప్రభుత్వం ఏం చెబుతే అదే బీసీసీఐ పాటిస్తుందని విమర్శించాడు. టీమిండియా, పాక్ పర్యటనకు రాకపోతే పాక్ కు మునిగిపోయేది ఏమి లేదని మియాందాద్ అన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో దుమారాన్ని లేపుతున్నాయి. మరి మియాందాద్ చేసిన ఈ చౌకబారు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Former Pakistan captain Javed Miandad lashes out at BCCI for their stance of not playing in Pakistan.#CricTracker #JavedMiandad #AsiaCup2023 pic.twitter.com/vgmiv5ToHb
— CricTracker (@Cricketracker) February 6, 2023