టీ20 వరల్డ్ కప్ పరాభవాన్ని మర్చిపోతూ.. మరో సిరీస్ కోసం టీమిండియా సిద్ధమైంది. సీనియర్లకు రెస్ట్ ఇవ్వడంతో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని భారత జట్టు న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై దారుణ ఓటమి తర్వాత ఇంటికొచ్చిన టీమిండియా.. మళ్లీ ఫ్రెష్ మైండ్‌తో న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టింది. శుక్రవారం తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్‌లో మునిగిపోయిన టీమిండియా ఆటగాళ్లు.. ఖాళీ దొరికిన టైమ్‌లో బీచ్‌కెళ్లి సరదాగా గడిపారు. అక్కడ దిగిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీచ్‌లో ఎంజాయ్ చేసిన వీడియోను వాషింగ్టన్ సుందర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కూడా పోస్టు చేశాడు.
టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఉమ్రాన్ మాలిక్‌లు బీచ్‌లో సరదాగా గడిపి బయటికి నడుచుకుంటూ వస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియలో ఆటగాళ్ల ఫుల్ ఫిట్‌గా సిక్స్‌ప్యాక్ బాడీలతో ఉన్నారు. క్రికెట్ ఆడేందుకు న్యూజిలాండ్ వెళ్లిన భారత ఆటగాళ్లు బీచ్‌లో సిక్స్ ప్యాక్ షోతో అదరగొట్టారు. కాగా.. ఆటగాళ్ల ఫొటోలపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే వరల్డ్ కప్‌లో చెత్త ప్రదర్శనతో పరువుపోగొట్టారు.. కనీసం న్యూజిలాండ్‌తో అయినా సిరీస్ గెలవండి అంటూ నెగిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. మరికొంత మంది మాత్రం వరల్డ్ కప్ చేదు అనుభవాన్ని మర్చిపోయి… మంచిగా రాణించాలని, సిక్స్‌ప్యాక్‌లు అదిరిపోయాని పేర్కొంటున్నారు.
అయితే.. శుక్రవారం తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. రెండో టీ20 20న(ఆదివారం), మూడో టీ20 22న(మంగళవారం) జరగనున్నాయి. అలాగే ఈ టీ20 సిరీస్ తర్వాత మూడు వన్డేల సిరీస్ కూడా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అయితే.. ఈ వన్డే సిరీస్‌కు మాత్రం శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. నవంబర్ 25, 27, 30 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. టీ20లు మన కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 నుంచి ప్రారంభ అవుతుండగా.. వన్డేలు ఉదయం 7 గంటల నుంచి మొదలవుతాయి.