దేశమంతటా హోలీ సెలబ్రేషన్స్ అంబరాన్నంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు, టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకూ పలువురు హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు హోలీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. రంగులతో ఆడుతూ, నీటి బిందువుల మధ్య కేరింతలు కొట్టారు. ఇందుకు తాము దూరం కాదంటూ భారత క్రికెటర్లు తమదైన శైలిలో హోలీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ, పాటలు పాడుతూ, డాన్స్‌లతో చిందేస్తూ.. చాలా హుషారుగా కనిపించారు.
దేశమంతటా హోలీ సెలబ్రేషన్స్ అంబరాన్నంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు, టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకూ పలువురు హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు హోలీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. రంగులతో ఆడుతూ, నీటి బిందువుల మధ్య కేరింతలు కొట్టారు. ఇందుకు తాము దూరం కాదంటూ భారత క్రికెటర్లు తమదైన శైలిలో హోలీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. బస్సులోనే టీమిండియా క్రికెటర్లు రంగుల హోలీని జరుపుకున్నారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ, పాటలు పాడుతూ, డాన్స్‌లతో చిందేస్తూ.. చాలా హుషారుగా కనిపించారు.
చివరి టెస్టు కోసం సన్నద్ధమవుతున్న భారత క్రికెటర్లు.. మంగళవారం నరేంద్రమోదీ స్టేడియంలో ప్రాక్టీస్ అనంతరం హోటల్ రూముకు వెళ్తూ బస్సులోనే రంగులు పూసుకుని ఉత్సాహంగా హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యువక్రికెటర్లు కలిసి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీని ఎంజాయ్ చేశారు. మరీ ముఖ్యంగా భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ, యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ బాలీవుడ్ పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలను కోలకతా నైట్ రైడర్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. క్రికెటర్లు అందరూ రంగుల్లో మునిగి తేలారు. ఇక గిల్ ముఖమైతే రంగులతో నిండిపోయింది. గిల్ వీడియో తీస్తున్నప్పుడు చూసి రోహిత్ శర్మ ఒక్కసారిగా ఎగ్జైట్ అయ్యాడు. గిల్ వీడియో తీస్తున్నప్పుడు వెనక నుంచి రంగులు విసరడం కనిపించింది.
Yeh Holi, #TeamIndia wali 🤩
🎥: @ShubmanGill(IG) | #INDvAUS #HappyHoli pic.twitter.com/Zb2i0UUPr7
— KolkataKnightRiders (@KKRiders) March 7, 2023
Ab hui na Holi Mubaarak! 🤩
🎥: @ShreyasIyer15 | #INDvAUS #TeamIndia #HappyHoli pic.twitter.com/TsfDkeMFED
— KolkataKnightRiders (@KKRiders) March 7, 2023
Happy Holi ❤️🧡💙💜💛💚#TeamIndia pic.twitter.com/CSklWjTFML
— Akshar Patel (@akshar2026) March 7, 2023