టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఐపీఎల్‌లో సత్తా చాటి జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న దీపక్ హుడా.. ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించడంతో దీపక్ హుడా ఖాతాలో ఒక రికార్డు చేరింది. క్రికెటర్‌గా జట్టులో చేరిన తర్వాత హుడా ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించింది. దీపక్ ఇప్పటి వరకూ భారత్ తరపున 7 వన్డేలు, 9 టీ20లు మొత్తం 16 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు.
ఈ 16 మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించడం విశేషం. దీపక్ తుది జట్టులో ఉన్న ప్రతీ మ్యాచ్ భారత్ గెలిచింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఆటగాడిగా దీపక్ హుడా నిలిచారు. గతంలో ఇలాంటి రికార్డు ఒకటి రొమేనియా ఆటగాడు ‘సాట్విక్ నడిగోటియా’ పేరు మీద ఉండేది. సాట్విక్ ఆడిన 15 అంతర్జాతీయ మ్యాచుల్లో రొమేనియా విజయం సాధించింది. ఇప్పుడు ఈ రికార్డును భారత్ ఆటగాడు దీపక్ హుడా బద్దలుకొట్టారు. దీంతో దీపక్ హుడా టీమిండియా పాలిట లక్కీ బ్యాట్స్‌మేన్‌గా పేరు సంపాదించుకున్నారు. దీపక్ ఉంటే ఇండియా గెలుస్తుంది అన్న పేరు తెచ్చుకున్నారు. మరి ఇండియా పాలిట లక్కీ ఛార్మ్‌గా మారిన దీపక్ హుడాపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
Deepak Hooda has turned out to be the lucky charm of the Indian teamhttps://t.co/RO0aWeSubC
— CricTracker (@Cricketracker) August 21, 2022