టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రతిష్టాత్మకమైన 100వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపర్చాడు. కేవలం 45 పరుగులు చేసి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. బ్యాటింగ్‌కు వచ్చినప్పటి నుంచి మంచి టచ్‌లో కనిపించిన కోహ్లీ.. సెంచరీ దిశగా వెళ్తున్నట్లు కనిపించాడు. కానీ అనూహ్యాంగా స్పిన్నర్ ఎంబుల్దేనియా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో షాక్‌కు గురైన కోహ్లీ అలాగే కొద్దిసేపు పిచ్‌కేసి చూస్తూ ఉండిపోయాడు. బంతి తిరిగిన విధానానికి కోహ్లీ ఖంగుతిన్నాడు. చేసేదేమి లేక పెవిలియన్ బాటపట్టాడు. తొలుత టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ వచ్చాడు. 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లక్మల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ కుమారాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 52 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హైదరాబాదీ ప్లేయర్ హనుమవిహారీ.. హాఫ్ సెంచరీ సాధించాడు. మరో ఓపెనర్ మయాంక్ 33 పరుగులు చేసి ఎంబుల్దేనియా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 80 పరుగుల వద్ద భారత్ 2వ వికెట్‌ను కోల్పోయింది.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ మంచిటచ్‌లో బ్యాటింగ్ చేస్తూ.. విహారీతో కలిసి 90 పరుగుల చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ క్రికెట్ ఫ్యాన్స్‌ను నిరాశ పరుస్తూ.. 45 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరి రెండో ఇన్నింగ్స్‌లోనైనా సెంచరీ చేయాలని కోహ్లీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి కోహ్లీ ఫస్ట్ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
1ST Test. WICKET! 43.3: Virat Kohli 45(76) b Lasith Embuldeniya, India 170/3 https://t.co/XaUgOQVg3O #INDvSL @Paytm
— BCCI (@BCCI) March 4, 2022
King Kohli out for 45(76) @imVkohli #100thTestForKingKohli #KingKohli pic.twitter.com/WRSqufkvca
— Chiyaan Praveen (@ARRahmanuyir) March 4, 2022
