భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో బంగ్లా బౌలర్లు రెచ్చిపోతున్నారు. స్వదేశీ పిచ్చులు కావడంతో నిప్పులు చెరుగుతున్నారు. భారత టాపార్డర్ బ్యాటర్లయిన శిఖర్ ధావన్(7), రోహిత్ శర్మ(27), విరాట్ కోహ్లీ(9) లను స్వల్ప స్కోరుకే పెవిలియన్ బాట పట్టించారు. దీంతో భారత జట్టు 49 పరుగలకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచులో బంగ్లాదేశ్ ఆటగాడు.. లిటన్ దాస్ మెరుపు ఫీల్డింగ్ చేశాడు. షార్ట్ ఎక్సట్రా కవర్ లో ఫీల్డింగ్ చేస్తున్న దాస్.. కోహ్లీ కొట్టిన షాట్ ను అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో అందుకున్నాడు.
తొలుత బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ కు దిగిన భరత జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. జట్టు స్కోరు 23 పరుగల వద్ద శిఖర్ ధవన్ (7) క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. మెహిదీ హసన్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతిని రివర్స్ స్వీప్ ఆడబోయి వికెట్ చేజార్చుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్నట్లుగానే కనిపించినా 11వ ఓవర్ లో షకీబ్ దెబ్బకు రోహిత్ శర్మ (27) క్లీన్ బౌల్డయ్యాడు. వెంటనే అదే ఓవర్ నాలుగో బంతికి విరాట్ కోహ్లీ కవర్స్ మీదుగా షాట్ ఆడబోయి లిటన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చాడు. షార్ట్ ఎక్సట్రా కవర్ లో ఫీల్డింగ్ చేస్తున్న దాస్.. కోహ్లీ కొట్టిన షాట్ ను అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో అందుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
Shakib Al Hasan gets Virat Kohli.
Captain Litton Das takes a magnificent catch.#ViratKohli #INDvsBAN https://t.co/xvRxZDI7TZ— Cricket Master (@Master__Cricket) December 4, 2022
Shikhar Dhawan ☝️
Rohit Sharma☝️
Virat Kohli☝️India lose their top three for just 49 runs.
📸: Sony Liv pic.twitter.com/r0Cii8ejAo
— CricTracker (@Cricketracker) December 4, 2022