క్రీడా ప్రపంచంలో రికార్డులకు ఆయుష్షు తక్కువ.. కానీ కొన్నింటికి మాత్రం కొంత టైమ్ పడుతుంది. రికార్డులు కొట్టడం లేట్ అవ్వొచ్చేమో కానీ.. కొట్టడం మాత్రం పక్కా. అయితే ఈ క్రమంలోనే తాజాగా ఆసియా కప్ 2022లో భాగంగా భారత్-పాక్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడిపోయింది. భారీ స్కోరును కాపాడుకోలేక ప్రత్యర్థికి విజయాన్ని అప్పగించింది. దీంతో పాక్ భారత్ పై ప్రతీకారాన్ని తీర్చుకున్నట్లు అయ్యింది. అయితే ఇండియా మ్యాచ్ ఓడిపోయినప్పటికీ పాక్ పై ఓ అరుదైన ఘనత సాధించింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆసియా కప్ – 2022 సూపర్-4లో భాగంగా ఆదివారం టీమిండియా-పాకిస్థాన్ జట్లు తల పడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు పాకిస్థాన్ పై 10 ఏళ్ల క్రితం నాటి రికార్డును తాజాగా బద్దలు కొట్టింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ లు కలిసి ఇండియాకు మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్ కు 54 రన్స్ జోడించారు. దీంతో భారత్ కు పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 62 పరుగులు లభించాయి. దీంతో గతంలో భారత్ 2012 లో పాకిస్థాన్ పై అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో పవర్ ప్లే లో చేసిన 48/1 పరుగుల రికార్డును బద్దలు కొట్టింది. దీంతో పది సంవత్సరాల రికార్డు తాజాగా తుడుచుకుపెట్టుకు పోయింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 181 రన్స్ చేసింది. భారత బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ 60 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలువగా, కెప్టెన్ రోహిత్ 28 రన్స్, రాహుల్ 28 పరుగులు చేశారు. షాదాబ్ ఖాన్ 31/2, నవాజ్ 25/1 తో భారత్ కు కళ్లెం వేశారు. ఇక భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పాక్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 71పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మహ్మద్ నవాజ్ 20 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగుల సునామీ ఇన్నింగ్స్ తో పాక్ ను గెలిపించాడు. అయితే మ్యాచ్ ఓడిపోయినప్పటికీ భారత్ పాక్ పై ఈ అరుదైన రికార్డును క్రియేట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
What a win! 🇵🇰#INDvPAK | #AsiaCup2022 pic.twitter.com/1KDci25HBz
— ICC (@ICC) September 4, 2022