చిన్న జట్టు శ్రీలంక కదానే అనుకుంటే.. టీమిండియాకు చుక్కలు చూపించింది. తొలుత బంతితో మన జట్టుని కట్టడి చేసి, ఆ తర్వాత బ్యాటుతో కంగారుపెట్టించారు. చివరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్ లో ఎలాగైతేనేం టీమిండియా విజయం సాధించింది. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ టీ20లో కొందరు కుర్రాళ్లు మాత్రం కేక పుట్టించే ఆటతీరుతో ఆకట్టుకున్నారు. దీంతో మూడు టీ20ల సిరీస్ ని భారత జట్టు విజయంతో ప్రారంభించింది. సరైన టైంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన దీపక్ హుడా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అయితే చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ ఎలా సాగిందనేది ఇప్పుడు చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ముంబయి వేదికగా మంగళవారం, టీమిండియా-శ్రీలంక మధ్య తొలి టీ20 జరిగింది. దీంతో టాస్ గెలిచిన లంక జట్టు.. భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. మన ఆటగాళ్లు తొలి ఓవర్ లో దూకుడుగా ఆడేసరికి.. భారీ స్కోరు చేస్తారేమోనని అభిమానులు తెగ ఆనందపడ్డారు. ఇలా మంచిగా స్టార్ట్ అయిన మన ఇన్నింగ్స్ లో.. శుభ్ మన్ (7) తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ (7), సంజూ శాంసన్ (5) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇక మరో ఎండ్ లో నిలకడగా ఆడుతున్న ఇషాన్ కిషన్ కు కెప్టెన్ హార్దిక్ పాండ్య తోడయిన తర్వాత కాస్త కుదురుకుంది. 10 ఓవర్లకు 75/3తో కాస్త కుదురుకున్నట్లు కనిపించింది. అది జరిగిన కొంత టైంకే ఇద్దరూ కూడా ఔటయ్యారు. దీంతో భారత్ కష్టాల్లో పడింది. మెయిన్ బ్యాటర్లందరూ ఔటైపోవడంతో.. ఇక భారత 130 కూడా చేయడం కష్టమేనని అనుకున్నారు. అలాంటి టైంలో దీపక్ హుడా (41 నాటౌట్), అక్షర్ పటేల్ (31 నాటౌట్) చెలరేగి ఆడారు. దీంతో నిర్ణీత ఓవర్లలో భారత్ 162/5 స్కోరు చేసింది.
ఇక ఛేదన ప్రారంభించిన లంక జట్టు.. ఓవైపు స్కోరు చేస్తూ వచ్చింది. కానీ అదే టైంలో వికెట్లు కూడా పోగొట్టుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ (28) మినహా ఎవరూ క్రీజులో నిలబడలేకపోయారు. నిశాంక 1, ధనంజయ 8, అసలంక 12, రాజపక్స 10 పరుగులు చేసి వచ్చిన వాళ్లు వచ్చినట్లే ఔటైపోయారు. ఇక ఓపెనర్ కుశాల్ కూడా పెవిలియన్ కు వెళ్లడంతో లంక గెలుపు కష్టమేననుకున్నారు. కానీ కెప్టెన్ శనకతో పాటు హసరంగ (21).. సడన్ గా మన బౌలర్లని బాదడం మొదలుపెట్టారు. ఓవైపు హసరంగ ఔటైనప్పటికీ.. శనక, చమికతో కలిసి మ్యాచ్ గెలిపించే ప్రయత్నం చేశాడు. ఇక 13 పరుగులు చేయాల్సిన స్థితిలో చివరి ఓవర్ వేసిన అక్షర్ పటేల్.. చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దీంతో 2 పరుగుల తేడాతో అతి కష్టం మీద మ్యాచ్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన శివమ్ మావి 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. దీపక్ హుడా కూడా కరెక్ట్ టైంకి బ్యాటింగ్ చేయడంతో ఈ మ్యాచ్ భారత్ గెలిచింది. లేదంటే మాత్రం దేవుడి ఇచ్చేయాల్సి వచ్చేది! మరి శ్రీలంకతో ఫస్ట్ టీ20లో టీమిండియా విజయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
That’s that from the 1st T20I.#TeamIndia win by 2 runs and take a 1-0 lead in the series.
Scorecard – https://t.co/uth38CaxaP #INDvSL @mastercardindia pic.twitter.com/BEU4ICTc3Y
— BCCI (@BCCI) January 3, 2023