ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత లంకను 215 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని 43.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్ ను 2-0 తేడాతో చేజిక్కించుకుంది. లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఒకదశలో వరుసగా వికెట్లు కోల్పోయినా.. కెఎల్ రాహుల్ (64), హార్ధిక్ పాండ్యా (36) నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.
శ్రీలంకతో ఇప్పటికే టీ20 సిరీస్ నెగ్గి ఊపుమీదున్న భారత్.. ఇప్పుడు వన్డే సిరీస్ కూడా సొంతం చేసుకుంది. రెండ్రోజుల క్రితం గువహతిలో ముగిసిన తొలి వన్డేలో విజయం సాధించిన భారత జట్టు.. కోల్‌కతాలో కూడా జయకేతనం ఎగురవేసింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక బ్యాటర్లకు భారత బౌలర్లు దడపుట్టించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వరుస విరామాల్లో వికెట్లు తీసి 215 పరుగులకే ఆలౌట్ చేశారు. 39.4 ఓవర్లలోనే లంక ఇన్నింగ్స్ ముగిసింది. కెరీర్ లో తొలి మ్యాచ్ ఆడిన నువానీడు ఫెర్నాండో(50) మినహా ఎవరు రాణించలేదు. భారత్ బౌలర్లలో కుల్దీప్, మహ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లు తీసుకోగా.. ఉమ్రాన్ మాలిక్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీసుకున్నారు.
A hard fought fifty for KL Rahul in his 5️⃣0️⃣th ODI match. 👏
🇮🇳 need 2️⃣3️⃣ runs to take the series 2-0.
📸: BCCI #PlayBold #TeamIndia #INDvSL pic.twitter.com/RHqCM4X725
— Royal Challengers Bangalore (@RCBTweets) January 12, 2023
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు శుభారంభం లభించలేదు. పవర్ ప్లే ముగిసేలోపే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్ (17), గిల్ (21), కోహ్లీ (4).. ఇలా వరుసగా పెవిలియన్ బాట పట్టారు. అనంతరం క్రీజులోకి వచ్చిన అయ్యర్(28; 33 బంతుల్లో 5 ఫోర్లు) కాసేపు మెరుపులు మెరిపించిన వారి వెంటనే పయనించాడు. ఈ క్రమంలో రాహుల్, పాండ్యా జోడి 75 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయం ఖరారుచేశారు. చివరలో పాండ్యా ఔటయినా అక్షర్ పటేల్‌తో జతకట్టిన రాహుల్ మ్యాచ్‌ను ముగించాడు. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ.. రాహుల్, పాండ్యా జోడిని విడగొట్టలేకపోయారు. లహిరు కుమార, చమిక కరుణరత్నే చెరో 2 వికెట్లు తీయగా.. కసున్ రజిత, ధనంజయ్ డిసిల్వా చెరో వికెట్ తీశారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే తిరువనంతపురం వేదికగా జనవరి 15, 2023న జరగనుంది.
For his impressive performance with the ball, @imkuldeep18 gets the Player of the Match award as #TeamIndia register a 4⃣-wicket victory in the second #INDvSL ODI 👏👏
Scorecard ▶️ https://t.co/jm3ulz5Yr1 @mastercardindia pic.twitter.com/jrSGU8JrB7
— BCCI (@BCCI) January 12, 2023