ఆస్ట్రేలియాను రెండు వరుస టెస్టుల్లో ఓడించిన తర్వాత భారత క్రికెట్ జట్టుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ప్రశంసల వర్షం కురింపించాడు. టీమిండియా ఓడించడం అసాధ్యం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో ఆస్ట్రేలియాను వరుసగా రెండు టెస్టుల్లో టీమిండియా చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కంగారులను ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా.. ఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అ రెండు టెస్టులను కూడా మూడు రోజుల్లో ముగించేయడం విశేషం. భారత స్పిన్ ఎటాక్ ముందు ఆస్ట్రేలియా బ్యాటర్లు తేలిపోయారు. స్పిన్‌ను అద్భుతంగా ఆడతాడని చెప్పుకునే స్మిత్ సైతం అశ్విన్ షికార్‌గా మారిపోయారు. ఇక మిగిలిన రెండు టెస్టుల్లోనూ విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియాను వైట్‌వాష చేయడంతో పాటు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023 ఫైనల్లోకి సగర్వంగా అడుగుపెట్టాలనే పట్టుదలతో ఉంది. మరి ఇదే జోష్‌తో ఆడితే.. అది పెద్ద లెక్కకాకపోవచ్చు.
ప్రస్తుతం టీమిండియా ఆడుతున్న క్రికెట్ చూసి ప్రపంచ మొత్తం ఆశ్చర్యపోతుంది. ఐసీసీ ర్యాకింగ్స్‌లోనూ టీమిండియా అదరగొట్టింది. ఆసీస్‌పై రెండు టెస్టులో విజయం తర్వాత.. భారత్ టెస్టుల్లో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని అందుకుంది. టెస్టులతో పాటు మిగిలిన రెండు ఫార్మాట్లు టీ20లు, వన్డేల్లోనూ ఇండియానే వరల్డ్ నంబర్ వన్ టీమ్‌గా ఉంది. దీంతో ప్రపంచ క్రికెట్ అభిమానులతో పాటు చిరకల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ కూడా భారత్‌ను ప్రశంసించక తప్పడం లేదు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్, పాక్ క్రికెట్ బోర్డు తాజా మాజీ చైర్మన్ రమీజ్ రాజా టీమిండియా గురించి ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఇండియాను ఇండియాలో ఓడించడం అసాధ్యం అంటూ ఆయన చేసన కామెంట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ప్రదర్శనపై రమీజ్ రాజా అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌తో టెస్టు క్రికెట్ అంటే ఎంత వక్క్‌అవుట్ చేసి రావాలని, ఆస్ట్రేలియా జట్టు అలా చేసినట్లు కనిపించడం లేదని అన్నాడు. అయినా భారత్‌ను భారత్‌లో ఓడించడం అసాధ్యం అని అన్నారు. ఇండియాలో క్వాలిటీ స్పిన్ ఎదుర్కొవాలంటే నార్మల్ టెక్నిక్ సరిపోదని, ప్రత్యేకంగా దానిపై ప్రాక్టీస్ చేయాలని అన్నాడు. టీమిండియా క్రికెటర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ అద్భుతంగా ఆడారంటూ రమీజ్ రాజా ప్రశంసలు కురిపించాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అక్షర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని అన్నారు. అలాగే జడేజా స్పిన్ ముందు ఆస్ట్రేలియా నిలువలేకపోయిందని పేర్కొన్నాడు. మరి టీమిండియా ప్రదర్శనపై రమీజ్ రాజా ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
‘Impossible to beat Team India’: Ramiz Raja slams Australia, drops huge statement after Rohit Sharma and Co. retain BGT
Cricket— Sayyad Nag Pasha (@nag_pasha) February 20, 2023