అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2021 ఏడాదిగాను పలు అవార్డులకు నామినీలను ప్రకటించింది. అన్నింట్లో ప్రముఖమైన క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో కూడా నామినీస్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ తరపున ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. మొత్తం నలుగురు క్రికెటర్లను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 విభాగంలో నామినీస్‌గా ప్రకటించింది.
ఇందులో.. పాకిస్తాన్ నుంచి షాహిన్ అఫ్రిదీ, రిజ్వాన్, ఇంగ్లండ్ నుంచి రూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఉన్నారు. మరి ఇందులో భారత ఆటగాళ్లు లేకపోవడంపై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. మరి ఈ నామినీస్ జాబితాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
All nominees of the seven individual categories of ICC Awards 2021 revealed 👀
Details 👇https://t.co/cQOddZ0gyA
— ICC (@ICC) December 31, 2021