యాషెస్ సిరీస్ తొలి టెస్టులో నెగ్గి జోష్ మీదున్న ఆస్ట్రేలియాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. అలాగే మ్యాచ్‌లో ఓడిపోయి బాధలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు కూడా ఐసీసీ ఝలక్ ఇచ్చింది.
క్రికెట్లో ఇప్పుడు లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్‌కు బాగా క్రేజ్ పెరిగింది. కానీ జెంటిల్మన్ గేమ్‌లో అసలైన మజా అంటే టెస్టు క్రికెట్లోనే ఉంది. సంప్రదాయక ఫార్మాట్ అయిన టెస్టుల్లో ప్రతి సెషన్‌కు ఆధిక్యం మారుతూ ఉంటుంది. టీమ్స్ కరెక్టుగా ఆడితే టీ20 క్రికెట్లో వచ్చే ఉత్కంఠతను మించిన టెన్షన్ టెస్టుల్లో వస్తుంది. దీనికి యాషెస్ సిరీస్‌ను ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ సిరీస్‌లో జరిగే ప్రతి మ్యాచ్ హైఓల్టేజీతో కూడుకున్నదే. అందుకే బూడిద ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు పోరాడితే చూడాలని ప్రతి క్రికెట్ అభిమాని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటాడు. ఈసారి యాషెస్ సిరీస్‌కు గ్రేట్ ఓపెనింగ్ లభించింది. ఫస్ట్ టెస్టులో ఉత్కంఠత తారస్థాయికి చేరిన టైమ్‌లో అద్భుతంగా ఆడిన ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది.
కంగారూ జట్టు విజయంలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (65)తో పాటు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (44) కీలక పాత్ర పోషించారు. కమిన్స్ అయితే ఇంగ్లీష్ బౌలర్ల జోరును అడ్డుకొని.. తన టీమ్‌ను విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కమిన్స్.. ఇంగ్లండ్ బజ్‌బాల్ స్ట్రాటజీని తుత్తునియలు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి సక్సెస్ జోష్‌లో ఆసీస్‌తో పాటు ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు ఐసీసీ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇరు జట్ల ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం కోతను విధించింది ఐసీసీ. నిర్ణీత టైమ్‌కు రెండు ఓవర్లు తగ్గిపోయాయనే కారణంతో ఆసీస్, ఇంగ్లండ్‌కు ఫైన్ వేసిన ఐసీసీ.. ఆయా జట్ల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లలోనూ కోత వేసింది. ఐసీసీ చర్యలు తీసుకోవడంతో ఈ రెండు టీమ్స్ రెండేసి డబ్ల్యూటీసీ పాయింట్లను కోల్పోనున్నాయి.
Both teams copped heavy fine and WTC points deduction for maintaining a slow over-rate in the Edgbaston Test.#Ashes #Ashes2023 #ENGvAUShttps://t.co/oV50P2Dmka
— Circle of Cricket (@circleofcricket) June 21, 2023