క్రికెటర్లు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. పక్కా డైట్ ఫాలో అవుతుంటారు. టీమిండియాకు ఆడేవాళ్లు కావొచ్చు, రాష్ట్రాల తరఫున ఆడే క్రికెటర్లు కావొచ్చు. తన హెల్త్ విషయంలో కేర్ తీసుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మనం అనుకోనివి జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా హిమాచల్ ప్రదేశ్ రంజీ జట్టుకు ఆడుతున్న సిద్ధార్థ్ శర్మకు అలానే జరిగింది. కేవలం 28 ఏళ్ల వయసులోనే ప్రాణాలు విడిచాడు. ఈ విషయన్ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. సిద్ధార్థ్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం సిద్ధార్థ్ మృతి.. క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అసలు విషయానికొస్తే.. హిమాచల్ ప్రదేశ్ కు ఆడుతున్న సిద్ధార్థ్ శర్మ రంజీల్లో భాగంగా జట్టుతో కలిసి గుజరాత్ వెళ్లాడు. కానీ ఆరోగ్యం పాడవడంతో గత రెండు వారాల నుంచి వెంటిలేటర్ పైనే ఉన్నాడు. ప్రాణాలతో పోరాడుతూ గురువారం తుదిశ్వాస విడిచాడు. విజయ్ హజారే ట్రోఫీ గెలిచిన జట్టులో భాగమైన సిద్ధార్థ్ కొన్నాళ్ల క్రితం పలు అనారోగ్య సమస్యల ఆస్పత్రిలో చేరాడు. చికిత్స తీసుకునేసరికి కాస్త కోలుకున్నట్లు కనిపించాడు. కానీ ఇప్పుడు మళ్లీ సీరియస్ కావడంతో గుజరాత్ వడోదరాలో ప్రాణాలు విడిచాడు. సిద్ధార్థ్ శర్మ.. చాలా చిన్న వయసులోనే అంటే 28 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయాడని తెలిసి సహ ఆటగాళ్లతోపాటు మిగతా జట్ల క్రికెటర్లు షాకవుతున్నారు.
సిద్ధార్థ్ కెరీర్ విషయానికొస్తే 2017-18లో హిమాచల్ ప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. రంజీ టోర్నీలో 25 వికెట్లు తీశాడు.2021-22లో విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడాడు. ఆరు మ్యాచుల్లో 8 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇక ఐదేళ్ల కాలంలో హిమాచల్ ప్రదేశ్ తరఫున ఓ టీ20, ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచులు, లిస్ట్ ఏలో చాలా మ్యాచులు ఆడాడు. గతేడాది డిసెంబరులో కోల్ కతా వేదికగా బెంగాల్ తో చివరి మ్యాచ్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన సిద్ధార్థ్.. తర్వాత ఇన్నింగ్స్ లోనూ పలు వికెట్లు తీసి మెప్పించాడు. మరి సిద్ధార్థ్ అకాల మరణం గురించి మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
मुख्यमंत्री श्री @SukhuSukhvinder ने हिमाचल की विजय हजारे ट्रॉफी विजेता क्रिकेट टीम के सदस्य रहे और प्रदेश के स्टार तेज गेंदबाज सिद्धार्थ शर्मा के निधन पर गहरा शोक व्यक्त किया है। मुख्यमंत्री ने शोक संतप्त परिजनों के साथ अपनी गहरी संवेदनाएं व्यक्त की हैं।
— CMO HIMACHAL (@CMOFFICEHP) January 13, 2023