ఆయనేమో దిగ్గజ క్రికెటర్. క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ దాదాపుగా తెలుసు. మరొకరేమో అద్భుత నటుడు. అలాంటి వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.
సినీ ఇండస్ట్రీలో రోలెక్స్ సూర్య కావొచ్చేమో కానీ క్రికెట్ లో రోలెక్స్ అంటే మాత్రం టీమిండియా దిగ్గజం సచిన్ తెందుల్కర్ గుర్తొస్తాడు. ఎందుకంటే తన 25 ఏళ్ల కెరీర్ లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఉన్నాయి. రోలెక్స్ ని చూసి విలన్స్ ఎలా అయితే భయపడ్డారో? సచిన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా ప్రత్యర్థి జట్ల బౌలర్లు అలానే భయపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు దిగ్గజ సచిన్ ని స్టార్ హీరో సూర్య కలిశారు. ప్రస్తుతం ఆ పిక్ వైరల్ గా మారింది. దాన్ని చూసిన ఫ్యాన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా పేరు చెప్పగానే సచిన్ ఎలా గుర్తొస్తాడో, తమిళ డబ్బింగ్ సినిమాలు అనగానే హీరో సూర్యనే గుర్తొస్తాడు. దాదాపు 20 ఏళ్ల నుంచి టాలీవుడ్ ఆడియెన్స్ ని అలరిస్తున్న సూర్య.. తెలుగు హీరోల రేంజులో క్రేజ్ సంపాదించాడు. సూర్యకు ఇక్కడ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే ఉంది. అందుకే సూర్య నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అందరూ అలెర్ట్ అయిపోతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా సచిన్ తో సూర్య ఫొటో దిగేసరికి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. లైక్స్, కామెంట్స్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
అయితే సూర్య సచిన్ తో ఎప్పుడు ఎక్కడ ఫొటో దిగారనేది మాత్రం తెలియలేదు. కేవలం ‘రెస్పాక్ట్ & లవ్’ అని క్యాప్షన్ మాత్రమే పెట్టాడు. కారణం పక్కనబెడితే.. ఇలా ఇద్దరు స్టార్స్ కలిసి కనిపించేసరికి ఫ్యాన్స్ ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఇదిలా ఉండగా రీసెంట్ గా సచిన్, హైదరాబాద్ లో జరిగిన రేసింగ్ చూసేందుకు వచ్చాడు. మరోవైపు సూర్య, తన 42వ సినిమాతో బిజీగా ఉన్నాడు. పీరియాడికల్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే.. సూర్య-సచిన్ ఫొటో చూడగానే మీకేం అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి.