ఓ వైపు వికెట్లు పడుతున్నాయి.. మరో వైపు బాల్స్ దగ్గర పడుతున్నాయి.. దాంతో క్రీజ్ లో ఉన్న ఏ బ్యాట్స్ మెన్ కైనా ఒత్తిడి కలగటం సహజమే. ఐతే ఒత్తిడికి తలొగ్గని వాడే విజేతగా నిలుస్తాడు.. తన జట్టును విజేతగా నిలుపుతాడు. తాజాగా అలాంటి ఒత్తిడికి ఎదురొడ్డి నిలబడ్డాడు పాండ్య. దాంతో పాక్ పై భారత్ విజయం సాధించింది. అయితే తన బలా బలాలను ఈ సందర్భంగా పాండ్య వెల్లడించాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం దేశం మెుత్తం మారుమ్రోగుతున్న పేరు. ఆదివారం ఆసియా కప్ లో భాగంగా పాక్ తో జరిగిన రసవత్తర పోరులో భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు. అటు బాల్ తో ఇటు బ్యాట్ తో తన సత్తాను మరో సారి ప్రపంచానికి సాటి చెప్పాడు. బౌలింగ్ లో 3 వికెట్లు తీయడంతో పాటు.. బ్యాటింగ్ లో కేవలం 17 బంతుల్లో 33 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. ఈ సందర్భంగా పాండ్యా మాట్లాడుతూ..” నేను మ్యాచ్ పరిస్థితులను బట్టి నా దగ్గర ఉన్న అస్త్రాలను ప్రత్యర్థిపైకి సంధిస్తాను. ఇక బౌలింగ్ లో షార్ట్ అండ్ హార్డ్ లెంగ్త్ బాల్స్ వేయడమే నా ప్రధాన బలం” అని పేర్కొన్నాడు.
మరిన్ని విషయాలను పంచుకుంటూ.. “నేను బ్యాట్స్ మెన్ లను తప్పులు చేసేలా రెచ్చగొడతానని, అలాగే ఛేజింగ్ మ్యాచ్ లలో ఓవర్ టూ ఓవర్ తన గేమ్ ని ఛేంజ్ చేస్తానని తెలిపాడు. ఇక బ్యాటింగ్ విషయాల్లో నేను చాలా ప్రశాంతంగా ఉంటానన్నాడు. నేను అనుకున్న ఉపాయాన్ని ఒత్తిడి లేకుండా అమలు చేస్తానని పేర్కొన్నాడు. ఈ క్రమంలో పాక్ తో మ్యాచ్ పై స్పందిస్తూ.. లాస్ట్ ఓవర్ లో 6 బంతులకు 7 రన్స్ చేయాల్సి వచ్చినా.. 15 పరుగులు చేయాల్సి వచ్చినా నేను ఒకే విధంగా బ్యాటింగ్ చేస్తానని” తెలిపాడు.
“అదీ కాక పాకిస్థాన్ ఇన్నింగ్స్ లో చివరి ఓవర్ నవాజ్ వేస్తాడని ముందే ఊహించానని చెప్తూనే.. దానికి తగ్గట్లే నా ప్లాన్ ను అమలు చేశానని పేర్కొన్నాడు. ఇలాంటి సమయాల్లో బ్యాట్స్ మెన్ కంటే బౌలరే ఎక్కువ ఒత్తిడి ఎదుర్కొంటాడని” పాండ్య వివరించాడు. ప్రస్తుతం పాండ్యా సుపర్ ఇన్నింగ్స్ పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. చేసిన పరుగులు కొన్నే కావోచ్చు కానీ కీలక సమయాల్లో చేసిన 1,2 పరుగులైనా జట్టు అవసరమే. ఈ క్రమంలో పాండ్యా బలాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
