ఐపీఎల్ 2022 సీజన్ ఎంతో ఉత్కంఠగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి ఎప్పుడూ ఐసీసీ మ్యాచ్‌లకున్న క్రేజ్ ఉంటుంది. ఐపీఎల్ ను ఒక అవకాశంగా మార్చుకుని టీమిండియాలో చోటు దక్కించుకున్న యువ ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. అయితే ఈ టోర్నీ మరుగున పడిపోయిన, టీమిండియాలో స్థానం కోల్పోయిన ఆటగాళ్లకు సైతం మరో అవకాశాన్ని పొందేందుకు దోహదపడుతుంది. అలాంటి అవకాశాన్ని వినియోగించుకుని కెరీర్లో సెంకండ్ ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించేందుకు ధినేష్ కార్తీక్ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ఈ సీజన్లో డీకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఎంతో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: IPL 2022లో ముంబై జట్టు ఆట తీరుపై రోహిత్ ఎమోషనల్ ట్వీట్!
ధినేష్ కార్తీక్ ఒక గొప్ప ఫినిషర్, మంచి వికెట్ కీపర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు ఒంటిచ్చేత్తో టీమిండియాను విజయతీరాలు చేర్చిన ఘనత ధినేష్ కార్తీక్ సొంతం. కానీ, అవకాశాలు కరువవడం, యువ ఆటగాళ్ల నుంచి పోటీ పెరగడంతో ధినేష్ టీమ్ నుంచి తప్పుకోక తప్పలేదు. గత ఐపీఎల్ సీజన్లోనూ డేకే పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు. కానీ, ఇప్పుడు మాత్రం టీమిండియాకి టీ20 వరల్డ్ కప్ తెచ్చిపెట్టడమే తన లక్ష్యం అని, అందుకోసమే కఠోర శ్రమ చేస్తున్నట్లు ధినేష్ వెల్లడించిన సగంతి తెలిసిందే. అయితే ధినేష్ తప్పకుండా టీమిండియాలో ఆడాలని కొందరు సీనియర్లు కూడా బలంగా కోరుకుంటున్నారు. వారిలో హర్భజన్ ఒకడు. అసలు ధినేష్ కార్తీక్ టీమిండియా టీ20 జట్టులో ఎందుకు ఉండాలో హర్భజన్ మాటల్లోనే విందాం.
‘ప్రస్తుతం ఉన్న ఫామ్ ని పరిగణలోకి తీసుకుని మాట్లాడితే.. ధినేష్ కార్తీక్ ప్రదర్శన ఎంతో అద్భుతంగా ఉంది. అతను ఆర్సీబీలో ఒక గొప్ప ఫినిషర్ పాత్ర పోషిస్తున్నాడు. నా దృష్టిలో ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జట్టులో వికెట్ కీపర్‌గా ఫస్ట్ ప్రయారిటీ ధినేష్ కార్తీక్ కి ఇవ్వాల్సి ఉంటుంది. పంత్ కన్నా కూడా ధినేష్ కార్తీక్ ప్రదర్శన ఎంతో అద్భుతంగా ఉంది. అరంగేట్రం నుంచి అతను ఒక గొప్ప ఆటగాడు. గతేడాది కేకేఆర్‌లో ఆడినప్పుడు కాస్త డల్ గా కనిపించాడు. ప్రస్తుతం అతను ఆడుతున్న తీరు ఎంతో గొప్పగా ఉంది. ఆర్సీబీలో మంచి ఫినిషర్ పాత్ర పోషిస్తున్నాడు. మ్యాచ్‌ను గెలిపిస్తున్నాడు కూడా.’
ఇదీ చదవండి: ముంబైపై మూడో సెంచరీ కొట్టిన కేఎల్ రాహుల్‌కు భారీ జరిమానా
‘ఆస్ట్రేలియా పిచ్ కండీషన్లు ఫాస్ట్ బౌలర్లకు చక్కగా అనుకూలిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో డీకే 360 డిగ్రీ బ్యాటింగ్ స్టైల్ గేమ్ స్వరూపాన్నే మార్చేయగలదు. ధినేష్ కార్తీక్ కరెక్ట్ ఫామ్లో ఉంటే అక్కడ ఏ బౌలర్ అతడిని కట్టడి చేసే పరిస్థితి ఉండదు. టీమిండియాలో అతని ప్రదర్శన బాగోక తప్పుకోలేదు.. అతనికి సరైన అవకాశాలు రాక రాణించలేకపోయాడు. ఈ టీ20 వరల్డ్ కప్ జట్టులో ధినేష్ కార్తీక్ మాత్రం తప్పకుండా చోటు ఉండాలి’ అంటూ హర్భజన్ సింగ్ అభిప్రాయ పడ్డాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ధినేష్ కార్తీక్ కి అతని వయసు ఒక అడ్డంకి కావచ్చు. 36 ఏళ్ల వయసులో ఉన్న డేకేకి రిషబ్ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ల నుంచి గట్టి పోటీ లభించే అవకాశం ఉంది. మరి, వారిని దాటుకుని జట్టులో స్థానం పొందగలడా అనేదే ప్రధాన ప్రశ్న. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ టీమిండియా జట్టులో ధినేష్ కార్తీక్ కు చోటు దక్కుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.