ఇటీవల జరిగిన టీ-20 ప్రపంచకప్ సమరంలో 12 దేశాలు పాల్గొన్నాయి. వీటిల్లో బలమైన జట్లు అనుకున్న భారత్, సౌతాఫ్రికా జట్లు గ్రూప్ దశలోని ఇంటి బాటా పట్టాయి. భారత్ జట్టు పాక్ మీద ఓడిపోయింది. దీనిని భారతీయులు ఎవరు జీర్ణించుకోలేకపోయారు. ఇలాంటి సమాయంలో గ్రూప్ దశ నుంచి కూడా నిష్క్రమించడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరితో పాటు ఓ క్రికెట్ అభిమానికిగా…టీ20 ప్రపంచకప్ లో భారత్ జట్టు ప్రదర్శనపై భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.గత నాలుగైదేళ్లలో తాను చూసిన అత్యంత దారుణమైన ప్రదర్శన ఇదేనని దాదా పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్లో భారత్ నాకౌట్ దశలోనే ఇంటిముఖం పట్టింది. లీగ్ దశలో తొలుత పాకిస్థాన్, ఆ తర్వాత న్యూజిలాండ్ చేతిలో దారుణ ఓటములు భారత్ కొప్పముంచాయి. చివరికి సెమీఫైనల్స్కు చేరుకోవాలంటే ఇతర జట్ల ఓటమిపైనా, వాటి రన్రేట్ పైనా ఆధారపడాల్సి వచ్చింది. చివరికి టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం అందరికి తెలిసిందే. “ఈ టీ20 ప్రపంచకప్లో మాత్రం భారత జట్టు ప్రదర్శనతో చాలా అసంతృప్తికి గురయ్యా. గత నాలుగైదేళ్లలో నేను చూసిన అత్యంత దారుణమైన ప్రదర్శన ఇదే”అని గంగూలీ ఆవేదన వ్యక్తం చేశాడు.”బ్యాక్స్టేజ్ విత్ బొరియా” అనే షోలో బొరియా మజుందార్తో మాట్లాడుతూ గంగూలీ ఈ విషయాలు చెప్పుకొచ్చాడు. వీటితో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు సౌరబ్ గంగూలి వెల్లడించారు.
“నిజం చెప్పాలంటే 2017, 2019లో భారత్ చాలా బాగా ఆడింది. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. ఆసమయంలో కామెంటేటర్గా నేనే ఉన్నాను. 2019 ప్రపంచకప్ ఇంగ్లండ్లో జరిగింది. అందరినీ ఓడించిన టీమిండియా సెమీస్లో కివీస్ చేతిలో ఓటమి పాలైంది. మనది కాని ఓ చెడ్డ రోజున రెండు నెలలపాటు పడిన కష్టం ఊడ్చిపెట్టుకుపోయింది”అని గంగూలీ చెప్పుకొచ్చాడు. గంగూలి తెలిపిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.