Virat Kohli vs Cheteshwar Pujara: చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ.. ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లే. టన్నుల కొద్దీ పరుగులు చేసిన ప్లేయర్స్. ఇది ఒకప్పుడు. మరి ఇప్పుడు.. పేలవ ప్రదర్శనతో ఒకరు జట్టులో స్థానం కోల్పోయి ఇంగ్లాండ్ కౌంటీలు ఆడుతుంటే.. మరొకరు జట్టుతోనే ఉంటూ భారంగా మారుతున్నాడు. ఇప్పుడు విమర్శకులు నోటి నుంచి వస్తున్న మాట ఇదే. నాలుగు సిరీసుల్లో పరుగులు చేయలేదనే సాకుతో పుజారాను జట్టు నుంచి తప్పించారు. ఈ కసితో పుజారా.. ఇంగ్లాండ్ కౌంటీల్లో నిలకడగా రాణిస్తూ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాడు. మరి కోహ్లీ విషయంలో అలా ఎందుకు చేయలేకపోతున్నారు? అతడిని కూడా అలా తప్పిస్తే.. తిరిగి పామ్ లోకి వచ్చే అవకాశం ఉంది కదా అంటూ సెలెక్టర్లను ప్రశ్నిస్తున్నారు.
రాహుల్ ద్రావిడ్ తరువాత భారత ‘నయా వాల్’ గా పేరుతెచ్చుకున్న పుజారా, స్వదేశీ, విదేశీ అనే తేడా లేకూండా.. వరుసగా నాలుగు సిరీస్ లలో ధారుణంగా విఫలమయ్యాడు. దీంతో జట్టు నుంచి తప్పించారు. ఈ కసితో ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడదానికి బీసీసీఐ పర్మిషన్ తీసుకున్న పుజారా.. ససెక్స్ తరుపున ఆడుతూ పరుగుల వరద పారించాడు. కౌంటీ ఛాంపియన్ షిప్ లో వరుస డబుల్ సెంచరీలతో ఒక సీజన్‌లో వెయ్యి పరుగుల మార్క్‌ను అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంతటితో ఆగాడా ! లేదు.. లిస్టు ఏ మ్యాచుల్లో సైతం వరుస సెంచరీలు బాదుతున్నాడు. అందులోనూ టీ20 స్ట్రైక్ రేట్ తో ఆడుతుండటం విశేషం. రాయల్ లండన్ వన్ డే కప్‌లో ససెక్స్ తరపున ఆడుతున్న పుజారా వార్విక్ షైర్ పై (79 బంతుల్లో 107 పరుగులు), సర్రేపై (131 బంతుల్లో 174 పరుగులు) చేశాడు.
Back-to-back 💯s with a strike rate of 130+ 🔥
Cheteshwar Pujara is in sublime form at the moment 👏
— ESPNcricinfo (@ESPNcricinfo) August 15, 2022
ఇలా.. పుజారా రాణించడం భారత్ కు కలిసొచ్చే అంశమైనా.. ఇది కోహ్లీపై విమర్శలకు దారిచూపుతోంది. సెంచరీ మాట పక్కనుంచండి. పరుగులు చేయాలేక నానా తంటాలు పడుతున్న ఆటగాడిని ఇంకెన్నాళ్లు వెనకేసుకొస్తారు అంటూ సెలెక్టర్ల తీరుపై మాజీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పుజారాకు చూసైనా కోహ్లీ నేర్చుకోవాలంటూ ఉచిత సలహాలిస్తున్నారు. మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న ఆసియా కప్ టోర్నీపైనే కోహ్లీ భవితవ్యం ఆధారపడి ఉంది. ఇక్కడ రాణిస్తేనే అక్టోబర్ లో జరగనున్నటీ20 వరల్డ్ కప్ జట్టులో ఉంటాడు కోహ్లీ. లేదంటే జట్టు నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
Mahela Jayawardene feels Virat Kohli will regain his form soon#ViratKohli #MahelaJayawardene #Cricket #AsiaCup #CricTracker #INDvPAK pic.twitter.com/BrJNpckl9J
— CricTracker (@Cricketracker) August 11, 2022
ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్ టీ20 టోర్నీ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ లో 6 జట్లు పాల్గొననున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్,ఆఫ్ఘనిస్తాన్ జట్లు నేరుగా క్వాలిఫై అవ్వగా.. 6వ జట్టు క్వాలిఫయర్ రౌండ్లో గెలిచి అర్హత సాధించాలి. ఇక క్వాలిఫయర్ రౌండ్‌లో హాంకాంగ్, కువైట్, సింగపూర్, యూఏఈ జట్లు పోటీపడనున్నాయి. ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ A లో భారత్, పాకిస్థాన్ తో పాటు క్వాలిఫయర్ జట్టు ఉండగా.. గ్రూప్ -Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. రెండు గ్రూపుల్లో టాప్ రెడు స్థానాల్లో నిలిచిన టీమ్స్ సూపర్ ఫోర్ రౌండ్‌కు క్వాలిఫై అవుతాయి. ఆపై.. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్స్ ఆసియాకప్ ఫైనల్‌కు వెళ్తాయి.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), దినేష్ కార్తీక్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్.
స్టాండ్‌బై ప్లేయర్లు: శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్.