ప్రపంచ క్రికెట్ లో ఆస్ట్రేలియా అత్యుత్తమ జట్టు అనడంలో సందేహం లేదు. రికీ పాంటింగ్, ఆడం గిలిక్రిస్ట్, ఆండ్రూ సైమండ్స్, స్టీవ్ వా బ్రదర్స్, గిలెస్పీ, మెక్ గ్రాత్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పుడు ప్రపంచ క్రికెట్ ను కొన్నేళ్ల పాటు శాసించారనే చెప్పాలి. వీరు జట్టులో ఉన్నారంటే ప్రత్యర్తి జట్టు ఏదైనా మ్యాచ్ ఏకపక్షంగా సాగేది. అయితే రాను.. రాను.. దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా తప్పుకోవడంతో ఆ జట్టు మునుపటి వైభవాన్ని కోల్పోయింది. అంతేకాదు.. ఆటగాళ్లు చీటింగ్ చేస్తూ పట్టుబడి నిషేధం ఎదుర్కొన్నారు. ఇవి చాలవన్నట్లు తాజాగా, ఆసీస్ మాజీ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్, ఆసీస్ సారథి సహా మరి కొంత మంది ఆటగాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
2018 మేలో ఆస్ట్రేలియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన జస్టిన్ లాంగర్ 2022 ఫిబ్రవరి వరకు ఆ పదవిలో కొనసాగాడు. ఇతని సారథ్యంలోనే ఆసీస్ జట్టు 2021 టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఆ తరువాత స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన యాషెస్ సిరీస్ లో 4-0 తేడాతో సిరీస్ చేజెక్కించుంది. ఇంత చేసినా ఈ ఏడాది ఆరంభంలో క్రికెట్ ఆస్ట్రేలియా అతడిని తొలగించి ఆండ్రూ మెక్ డొనాల్డ్ ను తదుపరి కోచ్ గా నియమించింది. అయితే ఇన్నాళ్లు నోరు మెదపని లాంగర్ తనను తొలగించడం వెనుకున్న రహస్యాన్ని బయటపెట్టాడు. తనను తప్పించడం వెనుక ప్రస్తుత ఆసీస్ టెస్టు, వన్డే సారథి ప్యాట్ కమిన్స్ తో పాటు మరికొంతమంది హస్తముందని వాపోయాడు.
Former Australia coach Justin Langer hit out against the delayed feedback from senior players in the squad
The Ashes and #T20WorldCup-winning coach believes he made the changes asked of him and still got forced out 🗣
— ESPNcricinfo (@ESPNcricinfo) November 23, 2022
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన లాంగర్ ప్రస్తుత ఆసీస్ జట్టులో ఉన్న ఆటగాళ్ల గురుంచి ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు. “నా గురుంచి వ్యతిరేకంగా ప్రచారం చేసినవాళ్లు పిరికివాళ్లు. కమిన్స్ తో పాటు మరికొందరు ఆటగాళ్లు నా ముందు మంచిగా నటించేవారు. అలా ఉంటూనే నా వెనక గోతులు తవ్వారు. నా గురించి బోర్డుకు ఉన్నవీ లేనవీ కల్పించి చెప్పారు. నా హయాంలోనే ఆసీస్ జట్టు పూర్తి ఫార్మాట్ లో ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించింది. కానీ, దాన్ని నేను ఎంజాయ్ చేయలేకపోయా. ఆ సమయం చాలా కష్టంగా అనిపించింది. జట్టులో చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహజమే. కానీ వ్యక్తుల స్వలాభం కోసం ఇలా చేయడం మాత్రం తప్పు.. ‘ అని కమిన్స్ తో పాటు మరికొందరు ఆటగాళ్లను ఉద్దేశిస్తూ లాంగర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
Only cowards won’t come to our live show in Brisbane, with special guest Justin Langer. Tickets here: https://t.co/McVyeSmDOs pic.twitter.com/1EYzTfGTbD
— The Grade Cricketer (@gradecricketer) November 23, 2022
ఇక ఈ ఏడాది యాషెస్ సిరీస్ ముగిసిన తర్వాత ఆసీస్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనకు ముందు లాంగర్ ను బాధ్యతల నుంచి తప్పించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఆండ్రూ మెక్ డొనాల్డ్ ను నియమించింది. ఈ టూర్ లో ఆసీస్ 1-0 తేడాతో టెస్ట్ సిరీస్ ను చేజిక్కించుకోగా, 2-1తేడాతో వన్డే సిరీస్ ను కోల్పోయింది. ఆపై ఇటీవలే స్వదేశంలో ముగిసిన టీ20 ప్రపంచకప్ లో కంగారూలు కనీసం సెమీస్ కు కూడా చేరకపోవడం గమనార్హం. ఇక నవంబర్ 30 నుంచి ఆస్ట్రేలియా -వెస్టిండీస్ మధ్య స్వదేశంలో టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది.