క్రికెట్లో క్యాచ్‌లు మిస్ అవ్వడం సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు అవి చాలా ఫన్నీగా మిస్ అవుతుంటాయి. క్యాచ్ పట్టబోయి కొంతమంది ఆటగాళ్లు గాయాలపాలవుతుంటారు. అలాంటి ఒక సంఘటనే తాజాగా చోటు చేసుకుంది. యూరోపియన్ క్రికెట్ టి10 లీగ్‌లో భాగంగా స్టార్ సీసీ, హెల్సెంకీ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హెల్సెంకీ టైటాన్స్ ఇన్నింగ్స్ సమయంలో.. జతిన్ మదన్ బౌలింగ్ గులామ్ అబ్బాస్ భట్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్‌కు తగిలిన బంతి గాల్లోకి లేచింది.
బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ క్యాచ్ తీసుకుంటాడని అంతా భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా బంతి అతని తలను తాకి బౌండరీ వెళ్లింది. దీంతో బ్యాట్స్‌మన్ ఔటవ్వాల్సింది పోయి అదనంగా నాలుగు పరుగులు సాధించాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి గులామ్ అబ్బాస్ ఔటవ్వడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ ఫన్నీ క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
pain. pic.twitter.com/sMvF2eZFu3
— That’s so Village (@ThatsSoVillage) February 21, 2022