బౌలర్ బంతి వేయకముందే బ్యాటర్ క్రీజు దాటితే అతన్ని రనౌట్ కాల్ చేయొచ్చు. దీనినే మన్కడింగ్ అని పిలుస్తారు. అయితే ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమని.. మన్కడింగ్‌ను నిషేధించాలంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. వారి వాదనలు వ్యతిరేకిస్తూ ఇటీవలే మన్కడింగ్‌ను చట్టబద్దం చేస్తూ మెరిల్‌బోర్న్ క్రికెట్ అసోసియేషన్(ఎంసీసీ) కొత్త సవరణ తీసుకొచ్చింది. ఇకపై మన్కడింగ్‌ను రనౌట్‌గా మారుస్తున్నట్లు ఎంసీసీ పేర్కొంది. అలా చట్టబద్దం చేసి సరిగా నాలుగు రోజులు గడవక ముందే.. ఆ రికార్డులో మొదటి వాడిని అవ్వాలనుకున్నాడో ఏమో.. తాజాగా ఓ బ్యాటర్.. బౌలర్ బంతి వేయకముందే సగం క్రీజు దాటేశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. యురోపియన్ క్రికెట్ లీగ్‌లో జరిగిన ఈ సంఘటన అందరకి నవ్వులు తెప్పిస్తోంది. బౌలర్ బంతి వేయకముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ సగం క్రీజు వరకు పరిగెత్తాడు. దీంతో బౌలర్‌కు రనౌట్ చేసే అవకాశం వచ్చినప్పటికి సైలెంట్ అయిపోయాడు. అంపైర్ ఔట్ చేయమని చెప్పినప్పటికి సదరు బౌలర్.. వద్దులే అన్నట్లుగా సైగ చేశాడు. దీంతో సదరు బౌలర్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రనౌట్ చేసే అవకాశమున్నప్పటికి క్రీడాస్పూర్తి ప్రదర్శనతో ఆకట్టుకున్నావు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Incredible backing-up from this lad 😂🏃♂️@EuropeanCricket pic.twitter.com/4mbICTxbc5
— That’s so Village (@ThatsSoVillage) March 13, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.