క్రికెటర్లు పర్యటనల్లో భాగంగా చాలా దేశాలు తిరుగుతుంటారు. ఈ క్రమంలోనే అక్కడి ఫుడ్ కొంత మందికి నచ్చుతుంది, మరికొంత మందికి నచ్చదు. అదీకాక అప్పుడప్పుడు ఆటగాళ్లకు ఆ ఆహారం పడకపోవడంతో ఫుడ్ పాయిజన్ అయ్యి కడుపునొప్పి రావడం, మోషన్స్ లాంటి సమస్యలు సైతం తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే పాక్ తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు వెళ్లనుంది.. టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ ఇంగ్లాండ్. దీంట్లో విశేషం ఏముంది అనుకుంటున్నారా? విశేషం కాదు పాక్ పరువు తీసే విషయం కూడా ఉంది ఇందులో. ఈ సారి పాక్ పర్యటనకు వెళ్తే తమతో పాటు సొంత వంట మనిషినే ఇంగ్లాండ్ నుంచి వెంటతెచ్చుకుంటామని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
”పాకిస్థాన్ లో ఫుడ్ బాలేదు.. అదీకాక ఆ ఆహారం తింటే మాకు కడుపులో నొప్పి వస్తోంది” ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తు ఇంగ్లాండ్ కెప్టెన్ మెుయిన్ అలీనే. టీ20 ప్రపంచ కప్ కు ముందు.. ఆసియా కప్ తర్వాత ఇంగ్లాండ్ 7 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా పాక్ లో అడుగు పెట్టింది. అప్పుడు ఇంగ్లాండ్ ఆటగాళ్లు పాక్ లో ఫుడ్ నచ్చక తెగ ఇబ్బంది పడ్డారు. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ మెుయిన్ అలీ అయితే ఈ విషయాన్ని భాహాటంగానే వెల్లడించాడు. ఇక మరోసారి ఇలా జరగకుండా ఉండాలంటే.. వంట మనిషిని ఇంగ్లాండ్ నుంచే తెచ్చుకోవడం మంచిదని బ్రిటీష్ జట్టు భావించింది. అందులో భాగంగానే పాక్ తో త్వరలో జరగబోయే 3 టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా పాక్ లో అడుగుపెట్టబోతోంది ఇంగ్లాండ్ జట్టు.
ఈ నేపథ్యంలోనే మరోసారి ఆహారానికి సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఇంగ్లాండ్ నుంచే వంట మనిషిని తెచ్చుకుంటున్నట్లు ప్రకటించింది. దాంతో అంతర్జాతీయ వేదికపై పాక్ పరువు పోయింది. ధనార్జనలో మూడో స్థానంలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. కనీసం పర్యటక జట్టుకు మంచి భోజనాన్ని అందించలేదా అంటూ నెట్టింట పాక్ పై విమర్శలు గుప్పిస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇది కేవలం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన విషయం కాదు. పాక్ పరువు, మర్యదలకు సంబంధించిన విషయం. ఎప్పుడైతే ఇంగ్లాండ్ సొంత వంట మనిషితో పాక్ లోకి వస్తాం అంటూ ప్రకటించిందో.. అప్పుడే పాక్ పరువు పోయిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తీసుకున్న ఈ నిర్ణయం క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
England’s Test team will travel with their own chef on the Pakistan tour as some players didn’t like the food quality and suffered stomach ache on the T20i tour. (Reported by Telegraph).
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 21, 2022