ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి యాషెస్ టెస్టులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఇంగ్లాండ్ అభిమాని ఆస్ట్రేలియా అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. అందుకు ఆ అమ్మాయి కూడా ఓకే చెప్పింది. దీంతో ఆమెను అమాంత హత్తుకుని.. లిప్‌లాక్ ఇచ్చేశాడు. ఆ తర్వాత ఉంగరాలు మార్చుకున్నారు. ఆ సమయంలో అక్కడున్న ప్రేక్షకులు చప్పట్లు కొట్టి ఇద్దరినీ అభినందించారు. అమ్మాయి పేరు నటాలీ, అబ్బాయి పేరు రాబ్ అని పేర్కొన్నారు.
YES 🙌
Massive shoutout to Rob Hale, he met Natalie back in 2017 during the last #Ashes with the Barmy Army!
Congrats guys 🇦🇺🏴
pic.twitter.com/iZsLTxSGAi— England’s Barmy Army (@TheBarmyArmy) December 10, 2021
ఈ స్పెషల్ ప్రతిపాదనను గ్రౌండ్‌లోని పెద్ద స్క్రీన్‌పై ప్రత్యక్షంగా చూపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గతంలో ఇలాగే చాలా సార్లు క్రికెట్ అభిమానులు తమ ప్రేమను స్టేడియంలో వ్యక్తపర్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే చెన్నై ఆటగాడు దీపక్ చాహర్ కూడా ఇలాగే స్టేడియంలో తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఉంగరాలు మార్చుకున్నారు. ఆ సమయంలో అక్కడున్న ప్రేక్షకులు చప్పట్లు కొట్టి ఇద్దరినీ అభినందించారు. అమ్మాయి పేరు నటాలీ, అబ్బాయి పేరు రాబ్ అని పేర్కొన్నారు.