ఆటలో దూకుడెక్కువ.. కానీ ఆ దూకుడే అతని బలహీనత. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడు.. కానీ గుడ్డిగా అతన్ని నమ్మలేం. జట్టు నుంచి తీసేస్తారు అన్న దశలో.. ఒక మంచి ఇన్నింగ్స్‌తో కొన్నాళ్లపాటు జట్టులో కొనసాగడం. ఇదే తన అలవాటు. ధోనీ వారసుడిగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ గురించి ఇన్నాళ్లు ఉన్న అభిప్రాయాలు ఇవి. కానీ ఇప్పుడు పరిస్థితులు దానికి భిన్నం. గబ్బా వేదికగా ఆసీస్ బౌలర్లను ఆటాడుకుంటూ టీమిండియాకి చిరస్మరణీయ విజయాన్ని అందించిన పంత్.. ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టు అందరకి గుర్తుండే ఉంటుంది. 32 ఏళ్లుగా ఓటమి ఎరుగని గబ్బాలో టెస్టు మ్యాచ్ కావడంతో ఓవర్ కాన్ఫిరెన్స్‌తో బరిలోకి దిగింది ఆస్ట్రేలియా జట్టు. ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైనీ సైతం.. మ్యాచుకు ముందు ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. అందుకు తగ్గట్టే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోర్.. 336 ఆలౌట్. ఫలితంగా ఆసీస్‌కి తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌట్. భారత లక్ష్యం.. 328 పరుగలు. 7 పరుగులకే రోహిత్ శర్మ అవుట్ కావడంతో 18 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు.
ఆఖరి రోజు మ్యాచ్ డ్రా చేసుకోవాలంటే 90 ఓవర్లు నిలబడాలి. అప్పటికే ఆడిలైడ్ పింక్ బాల్ టెస్టులో టీమిండియా 36 పరుగులకే ఆలౌట్ కావడంతో.. భారత జట్టు గెలుస్తుందనే నమ్మకం ఏ అభిమానికి లేదు. కానీ, అవన్నీ పటాపంచలు చేస్తూ.. భారత జట్టు అద్భుతమే చేసింది. శుబ్‌మన్ గిల్ 146 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 పరుగులు చేసి అవుట్ కాగా, రిషబ్ పంత్ 138 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 89 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు. రిషబ్ పంత్ ఆడిన ఈ ఒక్క ఇన్నింగ్స్ భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించడమే కాకుండా.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు కోట్లు కట్టబెట్టింది.
పంత్ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు భారీ డీల్ లభించిందట. ఇండియన్ మార్కెట్‌లో ప్రసార హక్కులను డిస్నీ స్టార్ ఏకంగా 250 మిలియన్ డాలర్లకు (అంటే సుమారు రూ.2 వేల కోట్లు) కొనుగోలు చేసిందట. రిషబ్ పంత్.. గబ్బా ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rishab Pant (89*), Cheteshwar Pujara (56) and Shubman Gill (91) scored half-centuries in 4rth Test & recorded a historic run-chase of 328 target by Australia at Brisbane Gabba ground to clinch 4 Test match series 2-1.#RishabPant #Brisbane #AjinkyaRahane #ViratKohli #MangoNews pic.twitter.com/0rZhrwv174
— Mango News (@Mango_News) January 19, 2021
ఇదీ చదవండి: Latest Cricket News: రియల్‌ఎస్టేట్ ఏంజెట్‌ను రెండో పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్
ఇదీ చదవండి: Sanju Samson: మంచి ఇన్నింగ్స్ ఆడుతున్న సంజూను ముంచిన దీపక్ హుడా!