బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి రెండు టెస్ట్ ల్లో ఘన విజయం సాధించిన టీమిండియా మూడో టెస్ట్ లో మాత్రం ఘోరంగా విఫలం అయ్యింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా బ్యాటర్లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు డాషింగ్ ఫినిషర్ దినేశ్ కార్తీక్.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి రెండు టెస్ట్ ల్లో ఘన విజయం సాధించిన టీమిండియా మూడో టెస్ట్ లో మాత్రం ఘోరంగా విఫలం అయ్యింది. దాంతో టీమిండియా బ్యాటర్లపై ఇంటా బయట విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టీమిండియా బ్యాటర్లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు డాషింగ్ ఫినిషర్ దినేశ్ కార్తీక్. తొలి రెండు టెస్టుల్లో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడం వల్లే టీమిండియా విజయం సాధించింది అని గుర్తు చేశాడు. ఇక జట్టుల పేరుకే ఏడుగురు టాపార్డర్ బ్యాటర్లు ఉన్నారని, కనీసం ఒక్కరు కూడా రాణించట్లేదని విమర్శించాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసిస్ తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై తాజాగా స్పందించాడు టీమిండియా ఆటగాడు దినేష్ కార్తీక్. తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యంపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.”ఇండోర్ టెస్టు ఓటమికి ఎన్నో కారణాలు చెప్పొచ్చు. అయితే వరుస విజయాలతో జట్టులోని లోపాలు బయటపడవు. ఒక్కసారి ఒడిపోతేనే బలహీనతలన్నీ బయటకు వస్తాయి. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు విఫలం అయ్యారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాపార్డర్ లో ఏడుగురు బ్యాటర్లు ఉన్నా గానీ.. ఒక్కరు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం బాధాకరం” అని డీకే చెప్పుకొచ్చాడు.
ఇక భారత్‌లో దేశవాళీ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్లకు ఇలాంటి పిచ్ లపై ఆడటం కొత్తేమీ కాదు. అయితే క్రీజులో ఎక్కువ సేపు ఉండాలనే ఆలోచన భారత బ్యాటర్లలో కనిపించడంలేదని డీకే అన్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా మారినప్పుడే ఆ బ్యాటర్ సత్తా ఏంటో తెలుస్తుంది. ఇంతకంటే కఠినమైన పిచ్‌లో ఆడి గెలిచిన చరిత్ర భారత్‌కు ఉంది అని దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు. భారత ఆటగాళ్లు పిచ్‌లో ఏదో ఉంది, కష్టంగా ఉందనే మైండ్ సెట్‌లోకి వెళ్లిపోయి ఆత్మ రక్షణలో ఆడుతున్నారు. ఇదే త్వరగా వికెట్ కోల్పోవడానికి కారణం అవుతోంది అని ఈ సందర్భంగా దినేష్ కార్తీక్ అన్నాడు.