టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఇషానిని పెళ్లి చేసుకోనున్నాడు. ఈనెల 9న గోవా వేదికగా వీరిద్దరు వివాహం చేసుకోనున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు పెళ్లి చేసుకోనున్న రెండో ప్లేయర్ గా రాహుల్ నిలిచాడు. మార్చి నెల చివరి వారంలో ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ మ్యాక్స్ వేల్ కూడా విని రామన్ అనే భారతీయ సంతతి యువతి ని పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే.
రాహుల్ వివాహం చేసుకోనున్న ఇషాని బెంగుళూరుకు చెందిన ఫ్యాషన్ డిజైనర్. రాహుల్, ఇషానీలు 2019 నుంచే డేటింగ్ లో ఉన్నారు. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి పెళ్లికి రాహుల్ కజిన్ బ్రదర్ దీపక్ చహర్ తో పాటు పలువురు టీమిండియా క్రికెటర్లు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మార్చి9న గోవాలో పెళ్లి చేసుకుని, మార్చి 12 బెంగుళూరులో రిసెప్షన్ జరగనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకు రాహుల్ చహర్ తన అంతర్జాతీయ కెరీర్ లో ఆరు టీ-20లకు ప్రాతినిధ్యం వహించాడు.
ఈ ఆరు మ్యాచ్ లో ఏడు వికెట్లను సొంతం చేసుకున్నాడు. రాహుల్ చహర్ ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్ లో 6 టి20ల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. అందులో ఏడు వికెట్లను సొంతం చేసుకున్నాడు. ఇక గతేడాది శ్రీలంకలో పర్యటించిన టీమిండియా కు ఎంపికైన రాహుల్ చహర్ వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. 22 రాహుల్ చహర్ ను గత నెలలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ.5.25 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంత చేసుకుంది. 2017లో పుణే సూపర్ జెయింట్స్ తరపున 2017లో రాహుల్ చహర్ ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. మరి.. ఓ ఇంటి వాడు కాబోతున్న రాహుల్ చహర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.