టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యపై చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ షాకింగ్ విషయాల్ని బయటపెట్టాడు. వాళ్లిద్దరూ గొర్రెలాంటోళ్లు అంటూ అనేశాడు. ఇంతకీ ఎందుకలా అన్నాడు?
టీమిండియాలో నిజాలన్నీ బట్టబయలైపోయాయి. ఓ ప్రముఖ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చాలా షాకింగ్ విషయాల్ని రివీల్ చేశాడు. ఆఫ్ ద రికార్డ్ ఇతడు వాటిని చెప్పగా.. సీక్రెట్ కెమెరాలతో మొత్తం రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. దీంతో మొత్తం వ్యవహారం గందరగోళంగా మారిపోయింది. అయితే ఇందులో వేరే సంగతులు ఎలా ఉన్నాసరే.. టీమిండియా స్టార్ క్రికెటర్లు అయిన రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య గురించి చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అభిమానుల మధ్య ఇదే చర్చకు కూడా కారణమైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవడం, రోహిత్ కెప్టెన్ కావడం చాలా ఫాస్ట్ గా జరిగింది. ఇది జరిగి నెలల వ్యవధిలోనే ఇప్పుడు టీమిండియా టీ20 జట్టుకు హార్దిక్ పాండ్య కెప్టెన్ అయిపోయాడు. ఈ విషయాలన్నింటి గురించి మాట్లాడిన చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ.. ‘భారత సీనియర్ క్రికెటర్లు పూర్తిస్థాయి ఫిట్ నెస్ కోసం డోపింగ్ లో పట్టుబడని ఇంజెక్షన్లని ఉపయోగిస్తారు. ఇక రోహిత్ శర్మ టీ20 కెరీర్ కూడా ముగిసింది. శుభమన్ గిల్ కు అవకాశం ఇవ్వడం కోసం కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్లకు టీ20ల నుంచి విశ్రాంతినిచ్చాం. హార్దిక్ పాండ్యనే ధీర్ఘకాలం కెప్టెన్ గా కొనసాగుతాడు.’ అని చేతన్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఇక కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య బాండింగ్ గురించి మాట్లాడిన చేతన్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘భారత జట్టులో రెండు వర్గాలున్నాయి. ఓ వర్గాన్ని రోహిత్ నడిపిస్తే.. మరో దాన్ని కోహ్లీ నడిపిస్తాడు. అయితే కోహ్లీ, రోహిత్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. విరాట్ ఫామ్ పోగొట్టుకుని ఇబ్బందిపడినప్పుడు రోహిత్ అతడికి అండగా నిలిచాడు. వీళ్లిద్దరి మధ్య ఇగోనే సమస్యగా మారింది. ఇకపోతే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య నన్ను గుడ్డిగా నమ్ముతారు. ఆ ఇద్దరూ మా ఇంటికి వచ్చారు. హార్దిక్ అయితే నన్ను రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాడు’ అని చేతన్ శర్మ చెప్పుకొచ్చాడు. మరి స్ట్రింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ బాగోతం బయటపడటంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
We Stand With Chetan Sharma pic.twitter.com/Og0SE9QcpZ
— ً (@Ro45Goat) February 14, 2023