ఇండియా-ఆస్ట్రేలియా రెండో టెస్టుకు ముందు నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి భారత్ ఆటగాళ్లు వారు బసచేస్తోన్న హోటల్ ని ఖాళీ చేశారు. హోటల్ యాజమాన్యం కోరడంతోనే ఆటగాళ్లు, సిబ్బంది ఆ విధంగా చేశారు. ఎందుకు..? ఏం జరిగింది..? అన్నది ఇప్పుడు చూద్దాం..
బోర్డర్- గావాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య స్వదేశంలో నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి టెస్ట్ ముగియగా.. విజయం సాధించిన భారత్, 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ శుక్రవారం నుంచి ఢిల్లీ వేదికగా జరగాల్సి ఉంది. అయితే.. ఈ మ్యాచుకు ముందు ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ఉన్నట్టుండి భారత్ ఆటగాళ్లు వారు బసచేస్తోన్న హోటల్ ని ఖాళీ చేశారు. అందుకు కారణం.. బీసీసీఐ తీసుకున్న తొదరపాటు చర్యలే అని తెలుస్తోంది. ఆ వివరాలు..
ఢిల్లీ వేదికగా త్వరలో జీ20 సమ్మిట్ జరగాల్సి ఉండటం, అందులోనూ పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఢిల్లీలోని హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్స్‌తో నిండిపోయాయట. అలా అడ్వాన్స్ బుకింగ్ అయినవాటిలో భారత ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ కూడా ఒకటి. ముందుగా బుకింగ్స్ అయిపోవడంతో భారత జట్టును ఖాళీ చేయాల్సిందిగా హోటల్ యాజమాన్యం కోరిందట. దీంతో మరో దారి లేక ఆటగాళ్లు, సిబ్బంది అందరూ అన్నీ సర్దుకొని మరో హోటల్‌కు వెళ్లారు. భారత జట్టు ఢిల్లీలో ఎక్కువుగా తాజ్ ప్యాలెస్ లేదా ఐటీసీ మౌర్య హోటళ్లలో బస చేస్తుంటుంది. అయితే ఈసారి పెళ్లిళ్ల సీజన్, జీ20 సదస్సుల కారణంగానే వాటిలో బస చేయడం కుదరలేదు. “ఢిల్లీలోని కర్కార్‌దుమాలోని ‘హోటల్ లీలా’లో భారత జట్టు బస చేసిందని..” బీసీసీఐ సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Wedding Season and G20 Presidency Force Team India To Change Hotel Ahead Of Delhi Test
.
.
.#India #TeamIndia #IndiavsAustralia #INDvsAUS #IndiavsAustralia pic.twitter.com/mHDTNY3flZ— Mirror Now (@MirrorNow) February 16, 2023
ఇదిలావుండగా, టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ జట్టు సభ్యులతో కలిసి ఉండడం లేదు. కోహ్లీ నివాసం ఢిల్లీయే కావడంతో కుటుంబ సభ్యులు కలిసి అక్కడే ఉంటున్నారు. గురుగ్రామ్‌లోని తన ఇంట్లోనే కుటుంబ సభ్యులతో గడపాలని కోహ్లీ నిర్ణయించుకోవడమే అందుకు కారణం. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఆటగాళ్లను వీఐపీ కేటగిరీకి చెందిన వారిలగా భావించే మనదేశంలో.. ఇలా హోటల్ ఖాళీ చేయమన్న పరిస్థితులు రావడం ఆశ్చర్యకరమంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై.. మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli Spotted Leaving Arun Jaitley Stadium After Today’s Practice Session.🚘❤
🎥: @ARUNSHARMAJI#ViratKohli #INDvAUS @imVkohli pic.twitter.com/7EyJfPKb3Z
— virat_kohli_18_club (@KohliSensation) February 15, 2023