టీమిండియా క్రికెటర్ హర్షల్ పటేల్ ఇంట విషాదం నెలకొంది. అతని సొదరి మృతి చెందింది. దీంతో హర్షల్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఐపీల్-2022లో భాగంగా బెంగుళురు తరపున పటేల్ ఆడుతున్నాడు. సొదరి మరణవార్త తెలుసుకున్న హర్షల్ పటేల్.. పూణె నుంచి ఇంటికి తిరుగు పయనమయ్యాడు.హర్షల్ పటేల్ సోదరి మరణవార్త తెలుసుకున్న పలువురు క్రికెటర్లు, అభిమానలు తమ సంతాపం తెలుపుతున్నారు. వారి కుటుంబం ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
‘‘దురదృష్టవశాత్తూ హర్షల్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అందుకే అతడు బయో బబుల్‌ను వీడాల్సి వచ్చింది. అయితే, చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఏప్రిల్ 12 నాటి మ్యాచ్ కంటే ముందే అతడు జట్టుతో చేరే అవకాశం ఉంది’’ అని ఐపీఎల్ వర్గాలు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
ఐపీఎల్ 2021 సీజన్‌లో మెరుపులా వెలుగులోకి వచ్చిన ప్లేయర్లలో హర్షల్ పటేల్ ఒకడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన హర్షల్ పటేల్, ఆ సీజన్‌లో 32 వికెట్లు తీసి, ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు. తాజాగా మరోసారి బెంగళూర్ తరపున ఆడుతున్నాడు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.