ఐపీఎల్ లో ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా ఆర్సీబీ జట్టు ఇంటి దారి పట్టింది. ఆఖరి లీగ్ మ్యాచులో గుజరాత్ మీద ఖచ్చితంగా గెలిస్తే ప్లే ఆఫ్ ఖాయమనుకుంటున్న దశలో పోరాడి ఓడిపోయింది. దీంతో ఎప్పటిలాగే కోహ్లీ భావోద్వేగం, ప్లేయర్లు నిరాశ. కానీ అభిమానులు మాత్రం ఈ సారి కాస్త సహనం కోల్పోయినట్లుగా కనిపిస్తుంది.
ఆర్సీబీ జట్టు తలరాత మారలేదు. ఆ జట్టు మరోమారు కప్ గెలవకుండానే ఐపీఎల్లో తమ ప్రయాణాన్ని ముగించింది. బెంగళూరు వైఫల్యానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే స్వయంగా ఆ టీమ్ కెప్టెన్ డుప్లెసిస్ తమ జట్టు కప్ గెలవదని ముందే చెప్పాడు. కానీ దీన్ని ఎవరూ నమ్మలేదు.
జరిగింది కోల్ కతా- రాజస్థాన్ మ్యాచ్ అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఓ విషయాన్ని గుర్తుచేసుకుంటూ తమ జట్టుని తిట్టుకుంటున్నారు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఒక్కసారి టైటిల్ గెలవకపోయినా ఆర్సీబీని ఇష్టపడే, మద్దతు తెలిపే అభిమానులకు కొదవే లేదు.
ఐపీఎల్ 2022లో ‘ఈ సాలా కప్ నమ్‌దే’ నినాదాన్ని నిజం చేసేందుకు ఆర్సీబీ మరో అడుగు ముందుకేసింది. బుధవారం జరిగిన ఏకైక ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను మట్టికరిపించింది. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడేందుకు రెండు జట్లు హోరాహోరీగా పోటీ పడ్డాయి. కానీ.. చివరికి ఆర్సీబీ విజయం సాధించి ఐపీఎల్ టైటిల్‌కు రెండు మ్యాచ్‌ల దూరంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో ఆర్సీబీ అద్భుత విజయం సాధించడంతో.. సోషల్ మీడియాలో ఆ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తుంది. […]
టీమిండియా క్రికెటర్ హర్షల్ పటేల్ ఇంట విషాదం నెలకొంది. అతని సొదరి మృతి చెందింది. దీంతో హర్షల్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఐపీల్-2022లో భాగంగా బెంగుళురు తరపున పటేల్ ఆడుతున్నాడు. సొదరి మరణవార్త తెలుసుకున్న హర్షల్ పటేల్.. పూణె నుంచి ఇంటికి తిరుగు పయనమయ్యాడు.హర్షల్ పటేల్ సోదరి మరణవార్త తెలుసుకున్న పలువురు క్రికెటర్లు, అభిమానలు తమ సంతాపం తెలుపుతున్నారు. వారి కుటుంబం ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ‘‘దురదృష్టవశాత్తూ హర్షల్ కుటుంబంలో […]
బెంగుళూరు వేదికగా భారత్-శ్రీలంక మధ్య చిన్నస్వామి స్టేడియం జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీకి వింత పరిస్థితి ఎదురైంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లీని ఉద్దేశించి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఫ్యాన్స్ ఆర్సీబీ.. ఆర్సీబీ.. అంటూ అరుస్తున్నారు. చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీకి హోం గ్రౌండ్ అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ ఆర్సీబీకి ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడం సహజం. ఆర్సీబీకి బ్రాండ్ అంబాసిడర్ లాంటి కోహ్లీకి అక్కడ ఇలాంటి పరిస్థితి కూడా కామనే. కానీ ఇక్కడ విశేషం […]