భారతదేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక భారతీయులు క్రికెట్ ను ఆటగా కాకుండా ఓ ఎమోషన్ గా భావిస్తారు. అలాంటి భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ.
భారతదేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే. అదీకాక భారతీయులు క్రికెట్ ను ఆటగా కాకుండా ఓ ఎమోషన్ గా భావిస్తారు. అందుకే టీమిండియా మ్యాచ్ లు ఎక్కడ జరిగినా కానీ అభిమానులతో స్టేడియాలు నిండుతుంటాయి. ఇక ఇండియాలో కొన్ని రాష్ట్రాలను మినహాయిస్తే.. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. అయితే మరికొన్ని రాష్ట్రాల్లో కొన్ని కొత్త స్టేడియాలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే మరో కొత్త క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తున్నట్లు బీసీసీఐ క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. అత్యాధునిక హంగులతో ఈ స్టేడియాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. సుమారు రూ. 300 కోట్ల రూపాయాలతో ఈ క్రికెట్ గ్రౌండ్ ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ గ్రౌండ్ ను ఎక్కడ నిర్మిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో మరో కొత్త క్రికెట్ గ్రౌండ్ రాబోతోంది. ఇక ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, సెక్రటరీ జై షా బుధవారం గ్రౌండ్ నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని పరిశీలించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని గంజారీ ప్రాంతం, వారణాసిలో ఈ స్టేడియాన్ని నిర్మించనున్నారు. దాదాపు రూ. 300 కోట్ల రూపాయాలతో ఈ గ్రౌండ్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 31 ఎకరాల భూమికి సంబంధించి రూ. 120 కోట్ల రూపాయల పరిహారాన్ని రైతులకు అందించింది. ఇక స్టేడియం నిర్మించే ప్రాంతాన్ని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తోపాటుగా ప్రత్యేక అధికారులు పరిశీలించారు. ఆ ప్లేస్ అధికారులతో పాటుగా.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాకి, కార్యదర్శి జై షాకు కూడా నచ్చిందని సమాచారం.
ఇక వారణాసిలో నిర్మించే ఈ స్టేడియాన్ని అత్యంత ఆధునిక హంగులతో నిర్మించనున్నారు. ఇక సీటింగ్ కెపాసిటీ వచ్చి 30 వేల మంది కూర్చుని మ్యాచ్ ను చూడగలరు. ఈ స్టేడియం నిర్మాణానికి సంబంధించి ఓ కాట్రక్టర్ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇక నిర్మాణానికి సంధించిన పేవర్ వర్క్ కు రెండు నెలలు పడుతుందని, ఆ తర్వాత వెంటనే ప్రారంభోత్సవ వేడుకు చేయనున్నట్లు తెలుస్తోంది. మరి వారణాసిలో 300 కోట్లతో స్టేడియం నిర్మించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
BCCI to build a new stadium in Varanasi for 300 crores. (Source – TOI)
— Johns. (@CricCrazyJohns) March 16, 2023