ప్రస్తుతం శ్రీలంక రావణ కాష్ఠంగా మారిన సంగతి తెలిసిందే. ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ప్రజలకు సహాయం అందిస్తున్న యూనిసెఫ్ కి తమ వంతు విరాళాన్ని ప్రకటించి పెద్ద మనసు చాటుకుంది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు. ఇటీవలే లంకలో మూడు టీ20లు, వన్డే, టెస్ట్ సిరీస్ లు ఆడిన ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్లు.. లంకలో నెలకొన్న దుస్థితిని దగ్గరుండి చూసి చలించిపోయారు. ఇన్ని కష్టాల్లోనూ శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లను లంక ప్రజలు ఆదరించారు. లంక ప్రజల అభిమానానికి ముగ్ధులైన ఆస్ట్రేలియా క్రికెటర్లు వారికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలోనే లంక పర్యటనలో భాగంగా వచ్చిన ప్రైజ్ మనీని యూనిసెఫ్ ద్వారా లంక చిన్నారులకు, కుటుంబాలకు అందించేందుకు సిద్ధమయ్యారు ఆసీస్ క్రికెటర్లు. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ‘ప్యాట్ కమిన్స్’ ఆస్ట్రేలియాలో యూనిసెఫ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
టెస్టులు, వన్డేలు, టీ20ల మ్యాచ్ లు ఆడగా వచ్చిన 45 వేల ఆస్ట్రేలియా డాలర్ల ప్రైజ్ మనీని.. లంక యూనిసెఫ్ కు అందించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. శ్రీలంక సంక్షోభంతో ఆర్ధికంగా చితికిపోయిన చిన్నారులకు, కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు ప్రైజ్ మనీని విరాళంగా ప్రకటిస్తూ ట్వీట్ చేసింది. ఇక ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. శ్రీలంకలో ప్రజల బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయో అనేది కళ్ళ ముందు కనబడుతుందని, మేము అక్కడ పర్యటించినప్పుడు వాళ్ళ కష్టాలను దగ్గరుండి చూశామని, అప్పుడే వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. అయితే కమిన్స్ ఇలా సాయం చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గత ఏడాది కరోనా క్లిష్ట సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడితే.. ప్యాట్ కమిన్స్, మిగతా ఆస్ట్రేలియా క్రికెటర్లు కలిసి 50 వేల డాలర్ల ఆర్ధిక సాయం చేశారు. ఇక శ్రీలంక టూర్ లో ఆస్ట్రేలియా.. మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను 2-1 తేడాతో గెలిచింది. కానీ వన్డే సిరీస్ లో మాత్రం ఓడిపోయింది. టెస్టు సిరీస్ ను 1-1 తో డ్రా చేసుకుంది. మరి ఆస్ట్రేలియా క్రికెటర్లు శ్రీలంకకు ఆర్ధిక సాయం చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
The donation will go towards @unicefaustralia‘s programs to support nutrition, healthcare, safe drinking water, education and mental health services.
If you’d like to make a contribution, head to https://t.co/sYLmA6vE19 💛
— Cricket Australia (@CricketAus) August 11, 2022