కామన్వెల్త్ క్రీడల్లో ఈ ఏడాది కొత్తగా మహిళల క్రికెట్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. కామన్వెల్త్ క్రికెట్‌లో తొలి గోల్డ్ మెడల్ ను ఆస్ట్రేలియా మహిళా జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్లో 9 పరుగుల స్వల్ప తేడాతో.. ఓడిన భారత మహిళల జట్టు వెండి పతకంతో సరిపెట్టుకుంది. అయితే ఫైనల్ మ్యాచ్ విషయంలో ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళల జట్టుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు చేసింది అసలు కరెక్ట్ కాదంటూ కామెంట్ చేస్తున్నారు.
గెలిచిన టీమ్‌పై నెటిజన్లు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే అనుమానం రావచ్చు. అయితే గెలుపు గురించి కాదులెండి. ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఆడిన మహిళల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయినా కూడా ఆస్ట్రేలియా యాజమాన్యం ఆ ప్లేయర్‌ని జట్టు నుంచి తప్పించేందుకు ఇష్టపడలేదు. సీజీఏ, సీజీఎఫ్, ఐసీసీని సంప్రదించి.. వారి నుంచి అనుమతి తీసుకుని ఫైనల్ మ్యాచ్ ఆడించారు.
Wtf is happened?
Tahlia Mcgrath came out without a mask despite being covid positive,then whats the point of isolating from teammates and wearing a mask in the dugout?
Where are the precautions?#INDvsAUS pic.twitter.com/nSCiJDOrgD— Geofinn_12 (@12Geofinn) August 7, 2022
తాలియా మెగ్రాత్ ఫైనల్స్ మ్యాచ్‌కు ముందే కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. అయితే ఈ కామన్వెల్త్ క్రీడల్లో పూర్తి ఫామ్‌లో ఉన్న తాలియా మెగ్రాత్‌ను పక్కన బెట్టేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా యాజమాన్యం ఇష్టపడలేదు. అధికారులను సంప్రదించగా.. మ్యాచ్ ఆడే సమయంలో, మ్యాచ్ తర్వాత కూడా ఒక నిర్ణీత దూరం పాటించాలని సూచిస్తూ.. తాలియా మెగ్రాత్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు అనుమతినిచ్చారు.
“I’m happy we didn’t say no”
Harmanpreet Kaur on Tahlia McGrath playing the Commonwealth Games final despite testing positive for Covid https://t.co/fSBxKKZJRf #B2022 #CWG22 pic.twitter.com/NxohoGFg5W
— ESPNcricinfo (@ESPNcricinfo) August 8, 2022
అయితే అంతా చేసి తాలియా మెగ్రాత్ ను ఫైనల్ మ్యాచ్‌లో ఆడించినా కూడా.. ఆమె ఆశించిన మేర రాణించలేక పోయింది. కేవలం 2 పరుగులకే ఔట్ అయ్యి పెవిలియన్ చేరింది. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. రెండు ఓవర్లు వేసి 24 పరుగులు సమర్పించుకుంది. మ్యాచ్ జరిగినంత సేపు, డగౌట్ లోనూ తాలియా మెగ్రాత్ జట్టు సభ్యులకు దూరంగానే ఉంది. కరోనా వచ్చినా ఆడేందుకు అనుమతి ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Harmanpreet Kaur and Ashleigh Gardner shared their views about Tahlia McGrath 🗣
The Australia allrounder featured in the #CWG2022 final despite testing positive for Covid-19 pic.twitter.com/FvUk75MnsG
— ESPNcricinfo (@ESPNcricinfo) August 8, 2022