ఆసియా కప్ 2022లో టీమిండియా ఇప్పటికే సూపర్ ఫోర్‌కు దూసుకెళ్లింది. గ్రూప్ ఏలో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ పనిపట్టిన భారత్.. తర్వాతి మ్యాచ్‌లో హాంకాంగ్‌పై విజయం సాధించింది. బుధవారం మ్యాచ్ ముగిసిన తర్వాత.. హాంకాంగ్ టీమ్ సభ్యులంతా కలిసి భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, జడేజాలతో ఇంటర్యాక్ట్ అయ్యారు. రోహిత్ శర్మ తన జెర్సీపై సంతకం చేసి హాంకాంగ్ కెప్టెన్‌కు బహుకరించాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ.. ఏకంగా హాంకాంగ్ ప్లేయర్ జెర్సీపైనే సంతకం చెక్కేశాడు. చాలా సేపు ఇరు దేశాల ఆటగాళ్లు ముచ్చటించుకున్నారు.
టీమిండియా ఆటగాళ్లు విలువైన సలహాలు, సూచనలను హాంకాంగ్ ఆటగాళ్లకు ఇచ్చారు. హాంకాంగ్ ఆటగాళ్ల రాకతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ సందడి సందడిగా మారింది. కాగా.. మ్యాచ్‌కు ముందే హాంకాంగ్ ఆటగాళ్లు టీమిండియా ఆటగాళ్లపై తన అభిమానం వెల్లడించారు. విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నట్లు ఆ టీమ్ కెప్టెన్ మ్యాచ్‌కు ముందే ఆకాంక్షించాడు. లీగ్ దశలో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 40 పరుగులు తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. టీమిండియా లాంటి ఛాంపియన్ జట్టుపై ఓడినా.. హాంకాంగ్ బౌలింగ్, బ్యాటింగ్‌లో మంచి పోరాట పటిమను కనబర్చి ప్రశంసలు అందుకుంది.
బౌలింగ్ సమయంలో తొలి 15 ఓవర్ల వరకు టీమిండియా బ్యాటర్లకు పరుగులు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టింది. అలాగే టీమిండియా బలమైన బౌలింగ్ లైనప్‌ను ఎదుర్కొని కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 152 పరుగులు చేసి శభాష్ అనిపించుకుంది. ఆసియా కప్ క్వాలిఫైయర్స్ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌లు నెగ్గి హాంకాంగ్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లోనే టీమిండియాతో ఆడటంతో పాటు మంచి ప్రదర్శన కనబర్చి.. కొండంత ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది. భారత్‌తో హాంకాంగ్ ఆడిన విధానం చూస్తే.. ఆ జట్టును తక్కువగా అంచనా వేయాడానికి వీల్లేదనిపిస్తుంది.
సూపర్ ఫోర్‌లో బెర్త్ కోసం హాంకాంగ్ తమ తర్వాతి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. భారత్ లాంటి బలమైన జట్టుకే అంత ఈజీగా లొంగని హాంకాంగ్.. పాక్‌పై అద్భుతం చేసి సూపర్ ఫోర్‌కు అర్హత సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే సూపర్ ఫోర్‌కు గ్రూప్ ఏ నుంచి భారత్, గ్రూప్ బీ నుంచి అఫ్ఘనిస్థాన్, శ్రీలంక చేరుకున్నాయి. ఇక మిగిలిన ఒక స్థానం కోసం హాంకాంగ్-పాకిస్థాన్ పోటీ పడుతున్నాయి. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో గెలిచిన వారు.. సూపర్ ఫోర్‌కు అర్హత సాధిస్తారు. మరి టీమిండియాపై హాంకాంగ్ ప్రదర్శన, డ్రెస్సింగ్ రూమ్‌లో సందడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: విరాట్ కోహ్లీకి అదిరిపోయే గిఫ్ట్.. హృదయాలు గెలుచుకున్న హాంకాంగ్ టీమ్!
Conversations to remember, memories to cherish and lessons for the taking! 👍 👍
Wholesome scenes in the #TeamIndia dressing room when Team Hong Kong came visiting. 👏 👏#AsiaCup2022 | #INDvHK pic.twitter.com/GbwoLpvxlZ
— BCCI (@BCCI) September 1, 2022