SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Asia Cup 2022 Afghanistan Players Cried After Lost Thrilling Match Against Pakistan

PAK vs AFG: గెలవాల్సిన మ్యాచ్‌లో పోరాడి ఓడిన అఫ్ఘనిస్థాన్‌! ఏడ్చేసిన క్రికెటర్లు

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 8 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
PAK vs AFG: గెలవాల్సిన మ్యాచ్‌లో పోరాడి ఓడిన అఫ్ఘనిస్థాన్‌! ఏడ్చేసిన క్రికెటర్లు

ఆసియా కప్‌ 2022లో హాట్‌ పేవరేట్‌గా ఉన్న పాకిస్థాన్‌ను అఫ్ఘనిస్థాన్‌ గడగడలాడించింది. ఫైనల్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘాన్‌ అంచనాలకు మించి రాణించింది. తొలుత బ్యాటింగ్‌ చేసి కేవలం 129 పరుగులు మాత్రమే చేసిన ఆఫ్ఘాన్‌.. పాకిస్థాన్‌ను అంత ఈజీగా గెలవనివ్వలేదు. చివరి ఓవర్‌ వరకు ఆఫ్ఘాన్‌ బౌలర్లు పాక్‌ను వణికించారు. ఆసియా కప్‌లో వరుసగా విఫలం అవుతున్న పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ ఈ మ్యాచ్‌లోనూ దారుణంగా విఫలం అయ్యాడు. గోల్డెన్‌ డక్‌గా తొలి ఓవర్‌లోనే పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో పాటు.. పాక్‌ బ్యాటర్లకు ఆఫ్ఘాన్‌ బౌలర్లు పరుగులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. దీంతో ఈజీగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చావు తప్పి కన్ను లొట్టబోయి గెలిచింది.

ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లు పాకిస్థాన్‌ను అఫ్ఘనిస్థాన్‌ బెంబేలెత్తించింది. 30 బంతుల్లో 43 పరుగులు అవసరమైన టైమ్‌లో పాకిస్థాన్‌.. కేవలం 3 వి​కెట్లు మాత్రమే కోల్పోయి ఉంది. ఈ దశలో మంచి బ్యాటింగ్‌ డెప్త్‌ ఉన్న పాకిస్థాన్‌ ఈజీగా మ్యాచ్‌ గెలుస్తుందని అంతా భావించారు. కానీ.. ఇక్కడి నుంచి ఆఫ్ఘాన్‌ అసలు ఆటను ప్రారంభించింది. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ మూడో బంతికి ఇఫ్తికర్‌ను ఫరీద్‌ అవుట్‌ చేశాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే సిక్సర్లతో విరుచుకుపడుతున్న షాదాబ్‌ను రషీద్‌ ఖాన్‌ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాతి ఓవర్‌ తొలి బంతికే మొహమ్మద్‌ నవాజ్‌ను ఫారూఖీ అవుట్‌ చేశాడు. అదే ఓవర్‌ చివరి బంతికి కుష్‌దిల్‌ షా కూడా అవుట్‌ అవ్వడంతో పాకిస్థాన్‌ 109 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.

ఇక చివరి 12 బంతుల్లో 21 పరుగులు అవసరమైన టైమ్‌లో ఫరీద్‌ 19వ ఓవర్‌ను అద్భుతంగా వేశాడు. ఆ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి మరో రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో పాకిస్థాన్‌ చేతిలో ఒకే ఒక్క వికెట్‌ ఉంది. కానీ.. 6 బంతుల్లో 11 పరుగులు కావాలి. క్రీజ్‌లో చూస్తే కొత్త కుర్రాడు బ్యాట్‌ కూడా సరిగ్గా పట్టుకోవడం రాని నసీమ్‌ షా ఉన్నాడు. అప్పటికే 18వ ఓవర్‌ను అద్భుతంగా వేసిన ఫారూఖీ చివరి ఓవర్‌ వేసేందుకు వచ్చాడు. దీంతో అఫ్ఘనిస్థాన్‌ విజయం ఖాయంగా కనిపించింది. కానీ.. అప్పటికే ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య కొట్టుకునేంత గొడవ జరగడం, నాలుగు ఓవర్ల నుంచి వికెట్లు, సిక్సులతో మ్యాచ్‌ థ్రిల్లింగ్‌గా సాగుతుండటంతో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి వచ్చేసింది.

ఈ ఒత్తిడిలోనే యార్కర్‌ ప్రయత్నించబోయిన ఫారూఖీ రెండు టాస్‌ బాల్స్‌ వేయడంతో.. నసీమ్‌ షా లడ్డుల్లా దొరికిన ఆ బంతులను అదే రేంజ్‌లో భారీ సిక్సులు బాదడంతో.. మరో 4 బంతులు మిగిలి ఉండగానే పాకిస్థాన్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ సాధిస్తుంది. చిన్న టోటల్‌ను కాపాడుకునేందుకు ప్రాణం పెట్టిన ఆడిన అఫ్ఘనిస్థాన్‌.. చివర్లో ఒత్తిడికి చిత్తైంది. దీంతో ఆఫ్ఘాన్‌ యువ క్రికెటర్లు గ్రౌండ్‌లోనే కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి అద్భుత పోరాట పటిమపై యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ప్రశంసలు కురిపించినా.. ఆల్‌మోస్ట్‌ గెలిచి ఓడిపోవడంతో.. ఆ బాధను వారు తట్టుకోలేకపోయారు. ఈ ఓటమితో అఫ్ఘనిస్థాన్‌తో పాటు ఇండియా కూడా ఆసియా కప్‌ను ఇంటికి పోయింది. మరి ఈ మ్యాచ్‌ ఆఫ్ఘాన్‌ బౌలర్ల ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: వీడియో: మ్యాచ్‌ తర్వాత స్టేడియంలో పొట్టుపొట్టు కొట్టుకున్న పాక్‌-ఆఫ్ఘాన్‌ ఫ్యాన్స్‌

Brother you’re the best you’re the star ⭐️ I love you ❤️ @fazalfarooqi10 pic.twitter.com/uGpqR4Wm1o

— Rahmanullah Gurbaz (@RGurbaz_21) September 7, 2022

“NASEEM SHAH YOU BEAUTY” You don’t know how much we needed these two sixes from you 🔥🔥 Best Match Ever ❤️ Take a Bow 🔥 Pak vs Afg pic.twitter.com/2fu0stXK87

— Ayaz Ahmed (@Ayaz12ahmed) September 7, 2022

India Afghanistan bye bye
🤫🤫#AsiaCup2022 “What a Match”
“Congratulations Pakistan”
“Remember the Name”#PakvsAfg Unbelievable
“Namak Haram”#UrvashiRautela
“Asif Ali” “WHAT A WIN”
“Umar Gul”#پاکستان_دشمن_ہوا_مسترد#IndianCricketTeam#ChampionsLeague #RohitSharma𓃵 pic.twitter.com/lByliuMCrL

— Talha Aslam Gujjar (@versatiletomat0) September 7, 2022

Tags :

  • Afghanistan
  • Asia Cup 2022
  • Cricket News
  • pakistan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆగని పాక్ ప్రేలాపనలు, ముకేశ్ అంబానీ రిఫైనరీని పేల్చేస్తామని హెచ్చరిక

ఆగని పాక్ ప్రేలాపనలు, ముకేశ్ అంబానీ రిఫైనరీని పేల్చేస్తామని హెచ్చరిక

  • పాక్ ఉగ్ర స్థావరాలు ఎలా ధ్వంసమయ్యాయో చూశారా, వైరల్ అవుతున్న గూగుల్ ఫోటోలు

    పాక్ ఉగ్ర స్థావరాలు ఎలా ధ్వంసమయ్యాయో చూశారా, వైరల్ అవుతున్న గూగుల్ ఫోటోలు

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • ప్రభాస్ ఫ్యాన్స్‌కు పుల్ కిక్, బాహుబలి ది ఎపిక్ టీజర్ విడుదల, సినిమా డేట్ ఫిక్స్

  • బిగ్‌బాస్ హౌస్‌లో ఆ కాంట్రోవర్సీ కొరియోగ్రాఫర్ ? రచ్చ మామూలుగా ఉండదుగా

  • సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో వచ్చేసిందిగా , ఎందులోనంటే

  • క్లాస్‌మెట్‌తో పెళ్లి కోసం భార్యను చంపేసిన కీచకుడు..అసలేం జరిగింది

  • క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు ఇదే, 6 పరుగులకే ఆలౌట్

  • రవితేజ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్, వాయిదా పడిన మాస్ జాతర

  • సుందరకాండలో ఇంటర్వెల్ సీన్ షాక్ ఇస్తుందా, ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది

Most viewed

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

  • చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎప్పుడొచ్చింది, ఎవరు పెట్టారు

  • ఒకప్పుడు అగ్ర హీరోలతో టాప్ హీరోయిన్, ఇప్పుడేమో నెల జీతానికి ఉద్యోగం

  • కూకట్‌పల్లి చిన్నారి హత్య మిస్టరీ వీడేనా, అసలేం జరిగింది

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam