టీమిండియా స్టార్ క్రికెటర్ పృథ్వీ షా సెల్పీ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. సెల్పీ ఇవ్వలేదని కొందరు వ్యక్తులు షాపై దాడి చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పృథ్వీ షాకు అండగా నిలబడ్డాడు సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్.
టీమిండియా స్టార్ క్రికెటర్ పృథ్వీ షా పై దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురుని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. వారిలో ప్రముఖ భోజ్ పూరి నటి, మోడల్ సప్నా గిల్ కూడా ఉంది. అయితే ఈ ఘటనలో పృథ్వీ షానే తనపై దాడి చేశాడని మోడల్ సప్నా గిల్ ఆరోపిస్తు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో క్రికెటర్ పృథ్వీ షాకు అండగా నిలబడ్డాడు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్.
పృథ్వీ షా.. రెండు రోజులుగా వార్తల్లో వినిపిస్తోన్న పేరు. డిన్నర్ కు వెళ్ళిన పృథ్వీ షాతో సెల్పీలు దిగేందుకు వచ్చారు కొందరు అభిమానులు. అయితే వారికి సెల్ఫీలు ఇచ్చాడు షా. అనంతరం మరికొన్ని యాంగిల్స్ లో సెల్పీలు ఇవ్వాలని సదరు గ్యాంగ్ ఒత్తిడి తేవడంతో చిరాకుకు లోనైయ్యాడు పృథ్వీ షా. ఈ తతంగాన్ని అంతా చూస్తున్న అతడి ఫ్రెండ్ హోటల్ యాజమాన్యానికి కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో వారు వచ్చి ఆ గ్యాంగ్ ను హోటల్ బయటకి పంపించారు. దాంతో కొపంతో వారు బేస్ బాల్ స్టిక్స్ పట్టుకుని హోటల్ బయటే నిలబడ్డారు. షా, అతడి ఫ్రెండ్ బయటికి రావడంతో వారితో వాగ్వాదానికి దిగారు ఆ గ్యాంగ్. చిన్న గొడవ కాస్త పెద్ద గొడవగా మారి కారు అద్దాలు ధ్వంసం అయ్యే దాక వెళ్లింది వ్యవహారం.
ఈ ఘటనపై షా పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే పృథ్వీ షా కు అండగా నిలబడ్డాడు సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్. తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేస్తూ.. పృథ్వీ షా ధైర్యంగా ఉండు.. నేను నీ వెంట ఉంటాను” అంటూ చిన్నతనంలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే పృథ్వీ షా, అర్జున్ టెండుల్కర్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వీరిద్దరు కలిసి ముంబాయి తరపున అండర్ 14 జట్టులో ఆడారు. ప్రస్తుతం అర్జున్ రంజీ ట్రోఫీలో గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహించగా.. పృథ్వీ షా ముంబాయి టీమ్ కు ఆడాడు. మరి తన ఫ్రెండ్ కు అండగా నిలబడ్డ సచిన్ కొడుకుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.