ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా ఘనంగా ప్రారంభించింది. ఈ సిరీస్‌లో భాగంగా గురువారం ఆరంభమైన తొలి టెస్ట్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ స్కోరు చేసి భారత్‌పై ఒత్తిడి పెంచుదామని భావించింది. కానీ మన బౌలర్ల ధాటికి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 177 స్కోరుకే కుప్పకూలింది. ఆసీస్ జట్టులో నలుగురు బ్యాట్స్‌మన్ మాత్రమే రెండంకెల స్కోరు చేశారంటే టీమిండియా బౌలర్ల ఆధిపత్యం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఆసీస్ బ్యాట్స్‌మన్ కూడా హాఫ్ సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. మార్నస్ లబుషేన్ (49), స్టీవ్ స్మిత్ (37), పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (31), అలెక్స్ క్యారీ (36) శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో ఫెయిలయ్యారు.
భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా (5/47), రవిచంద్రన్ అశ్విన్ (3/42) ప్రత్యర్థి పనిపట్టారు. పేసర్లు మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్‌తో మంచి సహకారం అందించారు. అక్షర్ పటేల్ వికెట్ తీయకపోయినా గుడ్ లెంగ్త్ బంతులతో ఆసీస్ బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెంచాడు. ఇక, జడేజా మాత్రం ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. గింగిరాలు తిరుగుతున్న అతడి బాల్స్‌ను ఎదుర్కొనేందుకు కంగారూ బ్యాట్స్‌మన్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంచి భాగస్వామ్యం నెలకొన్న ప్రతిసారీ జడ్డూ బౌలింగ్‌కు దిగి భారత్‌కు బ్రేక్ త్రూ అందించాడు. గాయంతో కొన్నాళ్లు టీమ్‌కు దూరమైన అతడు.. కమ్‌బ్యాక్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లు తీసి పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్‌ను జడ్డూ అవుట్ చేసిన తీరు సూపర్ అనే చెప్పాలి. క్రీజులో పాతుకపోయిన స్మిత్‌ను అద్భుతమైన లెగ్ స్పిన్ డెలివరీతో బౌల్డ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ జడేజా ఇలాగే బౌలింగ్ చేస్తే టీమిండియాను ఆపడం ఆసీస్‌కు కష్టమే. మరి, ఈ మ్యాచ్‌లో జడ్డూ ప్రదర్శన మీకెలా అనిపించదో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
That 𝐌𝐎𝐌𝐄𝐍𝐓 when @imjadeja let one through Steve Smith’s defence! 👌👌
Follow the match ▶️ https://t.co/SwTGoyHfZx #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/Lj5j7pHZi3
— BCCI (@BCCI) February 9, 2023