విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 ప్లేయర్ సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఒక ప్రత్యేకమైన విషయాన్ని వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా దూరమైన డివిలియర్స్.. కోచింగ్ వైపు వెళ్లకుండా వినూత్నంగా మరో దారి ఎంచుకోనున్నాడు. త్వరలో ఒక యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించనున్నట్లు డివిలియర్స్ ప్రకటించాడు. ఇందులో మరో విశేషం ఏమిటంటే ఈ ఛానెల్‌కు తొలి అతిథిగా తన బెస్ట్ ఫ్రెండ్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నాడు. డివిలియర్స్ చేసిన ప్రకటనతో ఇండియన్ క్రికెట్ అభిమానులతో పాటు, ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఐపీఎల్‌లో ఈ ఇద్దరూ కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు చాలా కాలం ఆడిన విషయం తెలిసిందే. డివిలియర్స్ ఆటకు గుడ్‌బై చెప్పగా.. కోహ్లీ కొనసాగుతున్నాడు.
కంటికి ఆపరేషన్..
రెటీనా డిటాచ్‌మెంట్ కారణంగా తన కంటికి ఆపరేషన్ జరిగిన విషయాన్ని డివిలియర్స్ వెల్లడించాడు. దీంతో ఇక మైదానంలోకి దిగే అవకాశమే లేదని స్పష్టం చేశాడు. 2018లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న డివిలియర్స్.. ఐపీఎల్‌లో 2021 వరకు కొనసాగాడు. కాగా.. ఐపీఎల్ 2023లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి వెళ్లి.. ఐపీఎల్ ఆడుతున్న సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ఆర్సీబీ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నట్లు ఏబీడీ పేర్కొన్నాడు.
భారత్‌లో ప్రత్యేక ప్రాజెక్ట్..
ఒక ‘ప్రత్యేక’ ప్రాజెక్ట్ కోసం నవంబర్‌లో భారత్‌కు రావాలనుకుంటున్నట్లు డివిలియర్స్ తెలిపాడు. మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై మరింత సమాచారం వెల్లడిస్తానని అన్నాడు. లెజెండ్స్ లీగ్‌లో ఆడమని టోర్నీ నిర్వాహకులు తనను సంప్రదించినా.. కంటి ఆపరేషన్ కారణంగా ఆడలేకపోయాయని అన్నాడు. అలాగే తన క్రికెట్ నాలెడ్జ్‌ను రాబోయే తరం క్రికెటర్లతో పంచుకోవాలనుకుంటున్నానని, కోచింగ్ సైడ్ కూడా వెళ్లనని, కానీ ఏదో విధంగా తాను నేర్చుకున్నది ఏదో ఒక జట్టుకు కాకుండా.. ప్రపంచం మొత్తానికి బోధిస్తానని డివిలియర్స్ వెల్లడించాడు. 18 ఏళ్ల పాటు క్రికెట్ ప్రయాణం చేసిన తర్వాత ఇంట్లో కొంత సమయం గడపాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
AB de Villiers will 𝐧𝐨𝐭 be making a comeback as a player pic.twitter.com/Mtz12W2SUC
— ESPNcricinfo (@ESPNcricinfo) October 3, 2022
“I want to start a YouTube channel and invite guests on my youtube channel. And first guests one will be Virat Kohli.” – Ab De Villiers
Bond between Abd and Virat kohli ❤🤗 pic.twitter.com/LwAvFog9lB
— Shamsi (MSH) (@Shamsihaidri1) October 3, 2022
ఇది కూడా చదవండి: వీడియో: నిస్వార్థానికి నిలువెత్తు రూపం కోహ్లీ! విరాట్ త్యాగానికి న్యాయం చేసిన DK