ఇటీవలి వర్షాలు వరదల భీభత్సం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఏపీ ప్రజలకు అటు ప్రభుత్వం నుండి సహాయక చర్యలు అందుతున్న సంగతి తెలిసిందే. అయితే.. రీసెంట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వానికి విరాళాలు రావడం మొదలైంది. అంటే ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ ఇప్పుడిప్పుడే జగన్ సర్కారును అర్ధం చేసుకోవడం మొదలు పెట్టారా అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి.. ఏపీకి జగన్ సీఎం అయ్యి రెండేళ్లు గడిచింది. ఇంతవరకు ఆయనను అర్ధం చేసుకోలేదా? ఈ ప్రశ్నలకు అన్నటికి ఇప్పుడు సమాధానం దొరికిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్లు, పెద్దలు ఏపీకి సీఎం జగన్ ను సీఎంగా అంగీకరించలేదన్న అభిప్రాయాలు అయితే పొలిటికల్ వింగ్ చాలా గట్టిగానే ఉన్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ స్టార్స్ గత రెండేళ్లలో వ్యక్తిగత అవసరాలకు తప్ప ఇండస్ట్రీ తరపున సీఎం జగన్ ను అటు ప్రత్యక్షంగా ఇటు పరోక్షంగా మీట్ అవ్వలేదు. మరి.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మాత్రం ఇండస్ట్రీ స్టార్స్, బిగ్ షాట్స్ ఆయనను కలిసి విష్ చేసి ఇండస్ట్రీకి ప్రోత్సాహకాలు అడిగేవారని, అలాగే ఆయన పార్టీకోసం ఎలక్షన్స్ టైంలో పనిచేసేవారిని వైసీపీ నుండి ఓపెన్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలా ఏపీకి చంద్రబాబు సీఎంగా వ్యవహరించిన ప్రతిసారి ఇండస్ట్రీ పెద్దలు ఆయనతో సన్నహితంగా ఉండేవారు.
కానీ.., అదే పెద్దలు జగన్ సీఎం జగన్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా కలవలేదంటే జగన్ గెలుపు పై నిరాశ చెంది ఉంటారని గుసగుసలు గుప్పుమంటున్నాయి. మరి గత ప్రభుత్వాన్ని కలిసి ఇండస్ట్రీకి ప్రోత్సాహకాలు అడిగినట్లుగా ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేక పోతున్నారని సినీ ప్రేక్షకులు సందేహిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే సీఎం జగన్ ఏపీలో సినిమా షోస్ పై, ఆన్లైన్ టికెట్ అమ్మకాలపై గట్టి నిర్ణయం తీసుకోవడంతో టాలీవుడ్ పెద్దలలో మార్పు వచ్చిందేమో అనుకుంటున్నారు. అందువల్లే సీఎం జగన్ ప్రభుత్వానికి లేఖలతో పాటు విరాళాలు కూడా ప్రకటించడం ప్రారంభించినట్లు వినికిడి. మరి.. ఈ విషయంలో నిజం ఏమిటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.