హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ హోటల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వెలుగు చూడటం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. డ్రగ్స్ వినియోగంపై కేటీఆర్‌కు బహిరంగ సవాల్ విసిరారు. కేటీఆర్ తన కుమారుడిని డ్రగ్స్ టెస్ట్‌కి తీసుకువస్తారా అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: మరోసారి మంచి మనసు చాటుకున్న కేటీఆర్
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘24 గంటలు పబ్‌లకు అనుమతి ఇచ్చింది ఎవరు.. 125 మందికి డ్రగ్స్ టెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేశారు. చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకుని మాపై రాజకీయాలు చేయడానికి సిగ్గు అనిపించడం లేదా. మా పిల్లల్నందర్ని డ్రగ్స్ టెస్ట్‌కి తీసుకుని వస్తాను.. కేటీఆర్ నీ కొడుకుని డ్రగ్స్ టెస్ట్‌కి తీసుకువస్తావా.. రెడీనా’’ అంటూ రేవంత్ సవాల్ విసిరారు. మరి రేవంత్ సవాల్‌పై కేటీఆర్, టీఆర్‌ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.