తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్న చేనేత దినోత్సవ సభలో ఓ వ్యక్తి దాడి చేయబోయాడు. యాదాద్రిజిల్లా పోచంపల్లిలో సభలో బండి సంజయ్ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. చేతిలో పెట్రోల్ బాటిల్ పట్టుకుని వేదిక పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని వెంటనే బీజేపీ కార్యకర్తలు, పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుండి బయటకు తీసుకొచ్చి అతని వద్ద నుండి పెట్రోల్ బాటిల్ ను లాక్కున్నారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ ప్రసంగిస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బండి సంజయ్.. పోచంపల్లిలో సభ ఏర్పాటుచేశారు. ఈ సభకు భారీగా జనం తరలివచ్చారు. చేనేత కార్మికుల గొప్పతనం గురించి ఆయన ప్రసంగించారు. చేనేత కళల అభివృద్ధికి కృషి చేస్తామని హామీకి ఇచ్చారు. బండి సంజయ్ సభలో పెట్రోల్ తో వచ్చిన వ్యక్తిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.