ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ఇప్పట్లో సద్దుమణిగేలా అనిపించడం లేదు. విధానాలపై పోరాటం చేస్తున్న తనపై వ్యక్తిగత ఆరోణలు చేస్తున్నారని, తన భార్యని అవమానించేలా మాట్లాడుతున్నారని చంద్రబాబు మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంలో మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్రంగా స్పందించారు. ఆయన చంద్రబాబుకి నేరుగా లేఖ రాయడం విశేషం.
తన సతీమణికి అవమానం జరిగిందని చంద్రబాబు కన్నీళ్లు కార్చడం ఆశ్చర్యం కలిగించింది. కానీ.., ఆనాడు నా కుటుంబాన్ని ఇంతకన్నా దారుణంగా అవమానించారు. నన్ను నా కొడుకుని బూటు కాలితో తన్నారు. నా భార్యని, కోడలిని అనరాని మాటలు అన్నీ అన్నారు. కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీ కోసమే కదా ఆనాడు నేను పోరాటం చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా నన్ను, నా కుటుంబాన్ని వేధించారు.
రాజమండ్రి వైద్యశాలలో 14 రోజులు నిర్భంధించి నా కుటుంబానికి నరకం చూపించాడు చంద్రబాబు. ఆ అవమానాలు భరిస్తూ.., ఆ క్షణమే చనిపోవాలి అనుకున్నాను. కానీ.., చంద్రబాబు మీ పతనాన్ని నా కళ్ళతో చూడాలనే ఆనాడు ఆత్మహత్య ఆలోచనని విరమించుకున్నాను. నువ్వు అందరికి చేసిందే.. ఈరోజు నీకు తిరిగి వచ్చింది అంటూ ముద్రగడ లేఖలో సంచలన విషయాలను ప్రస్తావించారు. ముద్రగడ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
One final press conference pedithe baagundu Mudragada https://t.co/Lw4dEnMjvX
— Picket Fences (@fences_picket) November 23, 2021