తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారాల్లో మునిగిపోయాయి. ఇక అధికార టీఆర్ఎస్ తరుఫున కేటీఆర్ తో పాటు స్థానిక ముఖ్య నేతలు సైతం ఇంటింటి ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఇక త్వరలోనే సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా మునుగోడు ప్రచారంలో సుడిగాలి పర్యటనకు సిద్దమవుతున్నారట. ఇక దీంతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా ప్రచారంలో జోరుమీదున్నాయి. ఇదిలా ఉంటే మునుగోడు బై పోల్ లో ప్రజాశాంతి పార్టీ సైతం పోటీలో ఉన్న విషయం మన అందికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత కే ఏ పాల్ మునుగోడు ప్రచారంలో పాల్గొంటూ ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే శనివారం చండూరులో ప్రచారం నిర్వహించారు కే ఏ పాల్. ఈ సమయంలో కే ఏ పాల్ ప్రచారంలో ఉండగా కొందరు అధికారులు కే ఏ పాల్ రెండు వాహనాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కే ఏ పాల్ అధికారులపై మండిపడుతూ.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ నా ఫాలోవర్. నేను ప్రచారానికి ఫర్మిషన్ తీసుకునే ప్రచారాన్ని చేస్తున్నాను. నన్ను అడ్డుకోవడానికి మీరు ఎవరంటూ ఘాటుగా స్పందించారు. మీరు చాలా ఓవరాక్షన్ చేస్తున్నారు. తెలంగాణకు కాబోయే సీఎం నేనే, కాస్త మర్యాద ఇవ్వండి అంటూ కేఏ పాల్ మండిపడ్డారు. కేఏ పాల్ చేసిన తాజాగా వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.