తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారాల్లో మునిగిపోయాయి. ఇక అధికార టీఆర్ఎస్ తరుఫున కేటీఆర్ తో పాటు స్థానిక ముఖ్య నేతలు సైతం ఇంటింటి ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఇక త్వరలోనే సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా మునుగోడు ప్రచారంలో సుడిగాలి పర్యటనకు సిద్దమవుతున్నారట. ఇక దీంతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా ప్రచారంలో జోరుమీదున్నాయి. ఇదిలా ఉంటే మునుగోడు బై పోల్ లో […]
తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నికల విషయం గురించే చర్చ నడుస్తుంది. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఆయన రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. మునుగోడు ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మునుగోడు ఉన్నికల ప్రచారాలు హూరా హూరిగా సాగుతున్నాయి.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాక పుట్టిస్తున్నారు. నిన్న మునుగోడు […]
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రజా గాయకుడు, యుద్ధనౌక గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత కేఎల్ పాల్ సమక్షంలో ఆయన పీఎస్‌పీ కండువా కప్పుకున్నారు. గత కొంతకాలంగా గద్దర్ కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు వస్తున్నప్పటికీ.. ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరి అందరికీ షాకిచ్చారు. అలాగే గద్దర్ వచ్చే నెలలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో సైతం పోటీ చేయనున్నట్లు కేఎల్ పాల్ ప్రకటించారు. ప్రజాశాంతి అభ్యర్థిగా గద్దర్‌ను […]