బై రెడ్డి సిధార్థ రెడ్డికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెడ్డి కీలక పదవిని అప్పజప్పారు. తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో ఆయనకు సీఎం జగన్ ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవిని ఇచ్చారు. కర్నూల్ జిల్లాలోని నందికొట్కూరు నియోజక వర్గంలో వైసీపీ సమన్వయ కర్తగా ఉన్నారు బై రెడ్డి. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా దూసుకెళ్తున్నాడు సిధార్థ రెడ్డి. ఏపీ రాజకీయాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాలిన పని లేదు. రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే వెలుగుతున్న సిధార్థ రెడ్డి ఫుల్ మాస్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపిస్తూ తన మానియాను కొనసాగిస్తున్నాడు.
ఏపీ రాజకీయాల్లో యువ నాయకుడిగా కొనసాగుతూ జగన్ కు సన్నిహితుడిగా వెలిగిపోతున్నాడు. తన మాస్ డైలాగ్ లతో యువకుల్లో మంచి ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నారు బై రెడ్డి సిధార్థ రెడ్డి. ఇక ప్రత్యర్థి పార్టీలైన జనసేన , టీడీపీ, బీజేపీలకు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ మాటల తూటాలను పేల్చుతున్నారు. సోషల్ మీడియాలో కూడా తన స్థానాన్ని ప్రత్యేకంగా లీకుంచుకున్నాడు బైరెడ్డి. ఇక గత ఎన్నికల్లో నందికొట్కూరు నుంచి పోటీచేయాలనుకున్నా.. రిజర్వ్ కేటగిరి కింద ఆయనకు టికెట్ లభించలేదు. అయినా కూడా క్రుంగి పొకుండా పార్టీలోనే కొనసాగుతున్నారు. జగన్ కు నచ్చిన బంటుగా కొనసాగుతు పార్టీలో అయన స్థానాన్ని ప్రత్యేకంగా ఏర్పరుచుకున్నారు. ఇక రానున్న రోజుల్లో బైరెడ్డికి ఎలాంటి పదవులు దక్కుతాయో చూడాలి మరి.