సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. సమయం చిక్కినప్పుడల్లా పవన్‌కళ్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తే బండ్ల రేపు జనసేన పార్టీలో చేరనున్నట్లు సమాచారం. సోమవారం గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జరగనుంది. కాగా ఈ సభకు బండ్ల గణేష్ హాజరవుతున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. అలాగే జనసైనికులను సభకు తరలిరావాలని కోరారు. దీంతో ఆయన జనసేనలో చేరనున్నట్లు ఊహాగానాలు మొదలైపోయాయి.
గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్.. షాద్‌నగర్ ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించి భంగపడ్డారు. 2018లో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని.. రాకుంటే తాను బ్లేడ్‌తో గొంతుకోసుకుంటానని శబదం చేసి వైరల్ అయ్యారు. ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు జనసేనలో చేరి ఆంధ్ర పాలిటిక్స్‌లో బిజీ అవుతారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. కాగా నిర్మాతగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌తో రెండు సినిమాలు నిర్మించారు. అందులో తీన్‌మార్ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. గబ్బర్‌సింగ్ సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మరి బండ్ల గణేష్ జనసేన పార్టీలో చేరితే.. దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: భీమ్లా నాయక్ సక్సెస్.. ట్విట్టర్ లో రెచ్చిపోయిన బండ్లన్న!
వీరులారా ధీరులారా,జన సేన సైనికులారా !! రండి కదలి రండి కడలి అలగా తరలి రండి. నేను కూడా వస్తున్నాను. మన దేవర నిజాయతీకి సాక్షిగా నిలబడడం కోసం, తెలుగు వాణి వాడి వేడి నాడి వినిపించడం కోసం, అమరావతి నించి హస్తిన దాకా అలజడి పుట్టించడం కోసం కలుద్దాం. కలిసి పోరాడదాం@PawanKalyan pic.twitter.com/srOQ3nxxOT
— BANDLA GANESH. (@ganeshbandla) March 13, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.
