తమిళ స్టార్ నటుడు విజయ్. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి సుపరిచితమే. ఇప్పుడు తాజాగా వారసుడు అంటూ వచ్చిన ఆయన తెలుగు వారికి మరింత దగ్గరయ్యారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
ఇళయ దళపతిగా పేరు తెచ్చుకున్న తమిళ స్టార్ నటుడు విజయ్. తమిళ స్టార్ విజయ్ కథానాయకుడిగా, తెలుగు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన సినిమా వారిసు. తెలుగులో వారసుడుగా సంక్రాంతికి విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. కన్నడ కస్తూరి రష్మిక హీరోయిన్ కాగా, దిల్ రాజు నిర్మాత. జనవరి 11న విడుదల తమిళంలో విడుదల కాగా, తెలుగులో కాస్త ఆలస్యంగా జనవరి 14న థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దీని హక్కులు కొనుగోలు చేసిన సంగతి విదితమే.
పలు డబ్బింగ్ సినిమాలతో విజయ్ తెలుగు వారికి సుపరిచితమే. ఇక్కడ ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ భీభత్సంగా ఉంది. తెలుగులో నేరుగా నటించాలని ఎప్పటి నుండో అభిమానులు కోరుతున్నారు. అయితే ఆ కోరికలు కొంత తీరుస్తూ.. తెలుగు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించారు. తెలుగు, తమిళం, ఇతర భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాఫ్ ను కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ కోసం అమెజాన్ ప్రై వీడియో కొనుగోలు చేసింది. ఎనిమిది వారాల తర్వాతే ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వాలన్న ఖండిషన్ ను పక్కకు పెట్టి.. ఈ నెలలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 22న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇక ప్రైమ్ వీడియో ప్రకటించడమే మిగిలి ఉంది. తమిళ, తెలుగు భాషలతో పాటు,హిందీలో కూడా ఆడియోను అందుబాటులోకి తీసుకున్నారట. ఫఖ్తు ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ గా సాగిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమా కథలోకి వస్తే మైనింగ్ వ్యాపార దిగ్గజం రాజేంద్ర కుమారుల్లో ఒకరే విజయ్. విదేశాల్లో చదువుకుని స్వదేశానికి వస్తాడు. తన తదుపరి వారసుడిగా ముగ్గురు కుమారుల్లో ఒకరిని చేయాలని భావించిన తండ్రి.. ప్రతిభ చాటుకున్న వారికే వ్యాపారాన్ని అప్పజెప్పుతానంటాడు. అయితే ఈ రేసులో ఉండటం ఇష్టం లేని మన హీరో .. తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఇంటికి దూరమవుతాడు. తర్వాత స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేస్తాడు. అటు తండ్రిని వ్యాపారానికి అడుగడుగునా అడ్డు తగులుతుంటాడు ప్రతినాయకుడు. దీంతో హీరో ఇంటికి తిరిగి రావాల్సి వస్తుంది. ఆ తర్వాత హీరో ఏం చేశాడన్నదీ తదుపరి కథ.