గతంలో వచ్చినన్నీ కాదు గానీ ఈ వారం కూడా ఓ మాదిరిగా పలు సినిమాలు ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయిపోయాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి చూసేద్దామా?
థియేటర్లలో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేం లేవు. యంగ్ హీరోల సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో కొన్ని సక్సెస్ కాగా, మరికొన్ని ఫెయిలవుతున్నాయి. ఇక సమ్మర్ సందడి అంతా వచ్చే నెల అంటే ఏప్రిల్ లో షురూ కానుంది. ఈ లోపు థియేటర్ లోకి మాత్రమే ఓటీటీలో కూడా చిన్న సినిమాలు చాలానే క్యూ కట్టేస్తున్నాయి. అలా గత కొన్నాళ్ల రేంజులో కాకపోయినప్పటికీ ఈ వారం 14కి పైగా చిత్రాలు ఓటీటీలో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైపోయాయి. మరి అవేంటో చూద్దామా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. మార్చి రెండో వారం వచ్చేసింది. చాలామంది పిల్లలు ఎగ్జామ్ టెన్షన్స్ తో చాలా బిజీగా మారిపోయారు. ఇక వీళ్ల వల్ల అటు పేరెంట్స్ కూడా రోజూ కంటే కాస్త ఎక్కువ బిజీగా మారిపోయారు. వీళ్లకు కాస్త రెస్ట్ దొరికితే చిన్న కునుకు వేస్తారు. లేదంటే అలా మొబైల్ లో సినిమానో సిరీసో చూసేందుకు ఇష్టపడతారు. వీళ్ల కోసమే అన్నట్లు ఈ వారం ఏకంగా 14 సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. వాటిలో తెలుగు సినిమాలు, సిరీసులతో పాటు ఇతర భాషల చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో ‘రానా నాయుడు’ సిరీస్ మాత్రం అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది. దానికి కారణం ఫస్ట్ టైంలో వెంకటేష్-రానా కలిసి నటించడం.