కేజీఎఫ్ సినిమాపై విమర్శలు వివాదంలో చిక్కుకున్న వెంకటేష్ మహా ఒక హీరో వల్ల నష్టపోయానంటూ ధర్నాకు దిగారు. వెంకటేష్ మహా ఒక ప్లకార్డు పట్టుకుని ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యువ దర్శకుడు వెంకటేశ్ మహాను వివాదాలు వీడట్లేదు. ‘కేజీఎఫ్’ మూవీలో హీరో పాత్రను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారిన సంగతి విదితమే. ఇది గడవక ముందే మరో విషయంలో ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడీ డైరెక్టర్.